వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెల్ ఫోన్ ద్వారా కరోనా వ్యాప్తిస్తుందట- ఎయిమ్స్ రాయ్ పూర్ అధ్యయనంలో షాకింగ్ నిజాలు...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పలు అధ్యయనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైరస్ వ్యాప్తికి గల అన్ని అవకాశాలను వైద్యులు, నిపుణులు, శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వైరస్ వ్యాప్తికి సంబంధించి పలు సంచలన అధ్యయనాలు వెలువడ్డాయి. తాజాగా ఇదే కోవలో ఎయిమ్స్ రాయ్ పూర్ డాక్టర్లు నిర్వహించిన ఓ అధ్యయనం అంతర్జాతీయంగా పేరున్న ఓ హెల్త్ మ్యాగ జైన్ లో ప్రచురితమైంది.

కరోనా వాహకాలుగా సెల్ ఫోన్లు...

కరోనా వాహకాలుగా సెల్ ఫోన్లు...


ఎయిమ్స్ రాయ్ పూర్ వైద్యులు నిర్వహించిన తాజా అధ్యయనంలో జనం ఎక్కువగా వాడుతున్న సెల్ ఫోన్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా సెల్ ఫోన్ ఉపరితలంపై ఉండే వైరస్ అది చేతులు మారినప్పుడు లేదా ఇతరులు తాకినప్పుడు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. సెల్ ఫోన్ ఉపరితలంపై వైరస్ నేరుగా మనిషి ముఖం, నోటిలోకి కూడా వ్యాపించే ప్రమాదముందని తేలింది.

 డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు ముప్పు...

డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు ముప్పు...

సెల్ ఫోన్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉన్న రంగం వైద్య రంగమేనని రాయ్ పూర్ ఎయిమ్స్ డాక్టర్లు తమ అధ్యయనంలో తేల్చారు. ప్రస్తుతం కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న పరిస్ధితులు, ఇతర అంశాలను అధ్యయనం చేశాక ఈ నిర్ధారణకు వచ్చినట్లు వారు తెలిపారు. సెల్ ఫోన్ల ద్వారా వైరస్ వ్యాప్తికి డాక్టర్లతో పాటు హెల్త్ కేర్ వర్కర్లకు, వైద్యరంగంలో నిపుణులకు ఎక్కువగా అవకాశం ఉందని, వీరి ద్వారా ఇతరులకూ సోకవచ్చని తేల్చారు. కొన్ని సందర్భాల్లో హెల్త్ కేర్ వర్కర్లు కనీసం 15 నిమిషాలకొక్కసారి ఫోన్ మాట్లాడుతుండటమే ఇందుకు కారణమని కూడా పేర్కొన్నారు,

సెల్ ఫోన్ ప్రభావాన్ని విస్మరించిన డబ్ల్యూహెచ్‌వో

సెల్ ఫోన్ ప్రభావాన్ని విస్మరించిన డబ్ల్యూహెచ్‌వో


కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్యసంస్ధ కానీ ఇతర అంతర్జాతీయ సంస్దలు కానీ విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఎక్కడా సెల్ ఫోన్ వల్ల కరోనా సోకుతుందని హెచ్చరించకపోవడంపై వైద్యులు తమ అధ్యయనంలో ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కేవలం చేతులు కడుక్కోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని మాత్రమే చెప్పడం సరికాదనేది వీరి వాదన.
ప్రస్తుతం కరోనా వైరస్ పై పోరాటంలో ముందున్న హెల్త్ వర్కర్లు పేషంట్లను ట్రాక్ చేయడం, తాజా మార్గదర్శకాలను, నివేదికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, ఇతర హెల్త్ వర్కర్లతో సంబంధాలు నెరపడంలో ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారని డాక్టర్లు పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయాలేంటి ?

ప్రత్యామ్నాయాలేంటి ?

సెల్ ఫోన్ ద్వారా కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్న నేపధ్యంలో హెల్త్ కేర్ వర్కర్లతో పాటు సాధారణ ప్రజలు కూడా హెడ్ సెట్లను వాడాలని, అలాగే సెల్ ఫోన్లకు బదులుగా కరోనా వార్డుల్లో ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవాలని ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ శ్రీనివాస్ రాజ్ కుమార్ సూచించారు. మరికొందరు డాక్టర్లు ఐసీయూలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో పనిచేసే వారు సెల్ ఫోన్లను వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

English summary
raipur aiims doctor's recent study published in a global health journal stated that mobile phone surfaces are potential high risk surfaces. which can directly comes in contact with the face or mouth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X