మోడీ క్యాబినెట్ 2.O.. మోడీ నివాసంలో కాబోయే మంత్రులు, సాయంత్రమే ముహూర్తం, సర్వత్రా ఉత్కంఠ !!
దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా యువ నాయకులతో మోడీ క్యాబినెట్ 2.O కొలువు దీరనుంది.ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముందు, ఆయన నివాసం వద్దకు కేబినెట్లో స్థానం దక్కించుకొనే కొందరు యువ నాయకులు రావడం ఆసక్తికరంగా మారింది. ఈరోజు సాయంత్రం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద కోలాహలం నెలకొంది.

మోడీ నివాసానికి చేరుకున్న కాబోయే మంత్రులు
మోడీ కేబినెట్ 2.0 విస్తరణకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే, భివాండి లోక్సభ ఎంపి కపిల్ పాటిల్, బిజెపి ఉత్తర ప్రదేశ్ మిత్రుడు అనుప్రియ పటేల్, కాంగ్రెస్ నుండి బీజేపీకి మారిన ఎంపి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరాఖండ్ శాసనసభ్యుడు అజయ్ భట్, సర్బానంద సోనోవాల్, భూపేందర్ యాదవ్, అనురాగ్ ఠాకూర్, మీనాక్షి లేకి, శోభా కరండ్లజే, సునీతా దుగ్గల్, ప్రీతమ్ ముండే, జి కిషన్ రెడ్డి, ఆర్‌సిపి సింగ్, పరుషోత్తం రూపాలా మరియు సంతను ఠాకూర్ కూడా పీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు.

నేడు సాయంత్రం క్యాబినెట్ విస్తరణలో 27 మందికి స్థానం
నేడు సాయంత్రం జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మొత్తం 27 మందికి స్థానం లభించనుంది. మధ్యప్రదేశ్ నుండి జ్యోతిరాదిత్య సింధియా పశ్చిమ బెంగాల్ నుండి శంతను ఠాకూర్ లేదా నిశిత్ ప్రామాణిక్, లద్దాఖ్ ఎంపీ జమ్యాంగ్ త్సెరింగ్, మహారాష్ట్ర నుంచి నారాయణ రాణే, డాక్టర్ ప్రీతమ్ గోపీనాథ్ ముండే, వరుణ్ గాంధీ రాజస్థాన్ నుంచి చంద్రప్రకాష్ జోషి రాహుల్ కశ్వాన్ లకు అవకాశం లభించనున్నట్లు గా తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి మండలిలో 20 మంది కేబినెట్ మంత్రులు ,9 మంది స్వతంత్ర హోదా గల మంత్రులు, 23 మంది సహాయ మంత్రులు మొత్తం కలిపి 52 మంది మంత్రులు ఉన్నారు. తాజాగా ఈ సంఖ్య 79కి పెంచనున్నట్లుగా సమాచారం.

కేంద్ర హోం శాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డికి పదోన్నతి
ఇక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డికి పదోన్నతి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కిషన్ రెడ్డి కూడా లోక కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి చేరుకున్నారు. ఆయనకు క్యాబినెట్ మంత్రిగా అవకాశం దక్కడం ఉన్నట్లుగా సమాచారం కేంద్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన సహకార మంత్రిత్వశాఖను కిషన్ రెడ్డికి అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మోడీ నివాసానికి రామ్ విలాస్ పాస్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పరాస్
మోడీ నివాసానికి వచ్చిన ఆసక్తికరమైన పేర్లలో ఒకటి దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పరాస్, చిరాగ్ పాస్వాన్ తాజా వ్యాఖ్యలతో ఆయనలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఐదుగురు పార్టీ ఎంపిలను సస్పెండ్ చేయడం గురించి తాను ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి సమాచారం ఇచ్చానని, పార్టీ కోటాలో మామను చేర్చుకుంటే తాను కోర్టుకు వెళ్తానని రామ్ విలాస్ కుమారుడు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మంగళవారం హెచ్చరించిన విషయం తెలిసిందే.
Recommended Video

యువతకు పెద్ద పీట వేస్తున్న క్యాబినెట్ విస్తరణ
ప్రధాని మోడీ తన మంత్రుల మండలిలో సాయంత్రం 6 గంటలకు మొదటి పునర్వ్యవస్థీకరణను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 27 మంది కొత్త మంత్రులతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుందని సమాచారం. వీరిలో అత్యధికులు కొత్తవారు,యువ నాయకులుగా ఉండటం, విద్యావంతులు కావడం, మహిళలకు కూడా పెద్దపీట వేయాలని భావించడం గుర్తించదగినది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications