వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ మళ్లీ దొరికిపోయాడు.. అద్వానీ ఫొటో కామెంట్‌పై ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

మళ్లీ బుక్కైన మోడీ.. అద్వానీ ఫొటో కామెంట్‌పై || Oneindia Telugu

ఢిల్లీ : క్లౌడ్ కవర్ రాడార్ థియరీతో నెటిజన్ల ముందు అడ్డంగా బుక్కైన ప్రధాని నరేంద్రమోడీ తాజాగా మరోసారి ట్రోలింగ్‌కు ఛాన్సిచ్చారు. గతవారం ఓ ఇంటర్వ్యూలో మేఘాలను అడ్డుపెట్టుకుని దాడి చేయాలనుకున్నామన్న ప్రధాని.. తాజాగా 80వ దశకంలోనే డిజిటల్ కెమెరా, ఈమెయిల్ వాడానంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాని కామెంట్లపై ప్రత్యర్థులతో పాటు నెటిజన్లు మోడీని ఆటాడుకుంటున్నారు.

Modi claims he used digital camera, email in 1987-88

ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోడీ.. తాను 1988లోనే డిజిటల్ కెమెరాను ఉపయోగించానని చెప్పారు. దానితో బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ ఫొటో సైతం తీశానని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఇంటర్నెట్ ఉపయోగించిన ఆ ఫొటోను అద్వానీకి మెయిల్ చేశానన్నారు మోడీ.

డిజిటల్ కెమెరాతో తాను తీసిన ఫొటో కలర్ ప్రింట్ చూసి అద్వానీ ఆశ్చర్యపోయారని మోడీ చెప్పారు. అయితే డిజిటల్ కెమెరా 1993లో వినియోగంలోకి రాగా... 1995లో ఈ మెయిల్ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మోడీ కామెంట్స్‌పై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పాశ్చత్య దేశాల్లో కూడా 1988లో ఈ మెయిల్ అంటే ఎవరికీ తెలియదని, తానుకూడా 1996లోనే మొదటిసారి ఈ మెయిల్ వాడానని, అలాంటిది 1988లోనే మోడీ ఈ మెయిల్ ఎలా చేశారని ప్రముఖ ఆర్థికవేత్త రూప సుబ్రమణ్య ట్వీట్ చేశారు.

Modi claims he used digital camera, email in 1987-88

మోడీ 1988లోనే ఈ మెయిల్ ఉపయోగించారు. చిత్రమేంటంటే ప్రపంచంలో అప్పటికి ఎవరికీ దాని గురించి తెలియదని ఒకరంటే.. డ్రైనేజి నుంచి గ్యాస్ తయారు చేసినట్లు మోడీ డిజిటల్ కెమెరాను ఈ మెయిల్‌ను తయారు చేశారు. భక్తులకు ఇంకేమైనా అనుమానం ఉందా? అని సాహిద్ సిద్దిఖీ అనే వ్యక్తి కామెంట్ చేశారు. మోడీ ఈ మెయిల్ ఉపయోగించిన సమయంలో అద్వానీ మెయిల్ ఉపయోగించారా అని మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 1987-88లో డిజిటల్ కెమెరాతో కలర్ ఫొటో తీశానని, 1988లో ఈ మెయిల్ ఉపయోగించానని మోడీ అంటున్నారు. బహుశా ఆయనకు మెడికల్ ట్రీట్‌మెంట్ అవసరమేమోనని ఓ నెటిజన్ అనుమానం వ్యక్తంచేశారు.

English summary
Prime Minister Modi has become a subject of ridicule on account of another implausible claim – that he used email in 1987-88 to send a colour photograph of his mentor Lal Krishna Advani, which he had clicked with a digital camera. He was soon caught in a flurry of jokes with the social media telling him that there was no email at that time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X