మనకూ కావాలి: ‘1200మంది’ చైనా ఎలివేటెడ్ బస్సుపై మోడీ కన్ను
న్యూఢిల్లీ: ప్రపంచంలో తొలిసారిగా చైనా తయారు చేసిన ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్సు పలు దేశాలను అమితంగా ఆకర్షిస్తోంది. అదే విధంగా ఈ బస్సుపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 'ఈ తరహా బస్సును మనదేశంలోనూ రద్దీగా ఉండే నగరాల్లో నడిపితే ఎలా ఉంటుంది? దీని సాధ్యాసాధ్యాలను విశ్లేషించి నివేదిక అందించాలి' అని నరేంద్ర మోడీ అధికారులను ఆదేశించారు.
హైవే కారిడార్‌లపై ట్రాఫిక్ నియంత్రణపై వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో ఆయన సమావేశమై చర్చలు జరుపుతున్న వేళ ఈ బస్సు ప్రస్తావన వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారి చైనా రూపొందించిన ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవాలని రోడ్డు రవాణా మంత్రిత్వశాఖను ప్రధాని నరేంద్రమోడీ ఆదేశించారు.

అత్యంత రద్దీగా ఉండే మన దేశంలోని నగరాల రోడ్లకు ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్ లు అనువుగా ఉంటాయో లేదో విశ్లేషించి నివేదిక అందించాని అధికారులకు సూచించారు. టీఈబీ-1 పేరిట చైనాలో తయారైన ఈ బస్సు సబెయి ప్రావిన్స్ లోని కిన్ హువాంగ్ డావో నగరంలో విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే.
అటు పర్యావరణానికీ అనుకూలంగా ఉండే బస్సులో ఒకేసారి 1200 మంది ప్రయాణించవచ్చు. ఇదే సమయంలో బస్సు కింద నుంచి ఇతర వాహనాల ప్రయాణానికి కూడా అనువుగా ఉంటుంది.
రోడ్డుకు రెండు మీటర్ల ఎత్తులో బస్సు ఉంటుంది. వీటితో నగరాల్లో ట్రాఫిక్ అవసరాలను తీర్చడంతో పాటు మెట్రో రైళ్లు, సబర్బన్ రైళ్ల కంటే చౌకగా వీటిని తయారు చేసుకోవచ్చు. దీంతో ఈ తరహా బస్సు ప్రయోగాలు చేపట్టాలని పలు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications