మోడీ-ట్రంప్: 22 కిలోమీటర్ల రోడ్ షో: ఎర్ర తివాచీ..నల్ల కార్లు: మోడీ ఒక్కరే: ఎందుకంటే..!

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో కలిసి ఈ ఉదయం 11:55 నిమిషాలకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కరే ట్రంప్ కుటుంబానికి స్వాగతం పలికారు. సాదరంగా ఆహ్వానించారు.

Recommended Video

    Namaste Trump : World's Two Most Powerful Persons In Ahemadabad | Oneindia Telugu

    గుజరాత్ గవర్నర్ గానీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ గానీ, ఆయన మంత్రి వర్గ సహచరులు గానీ, అహ్మదాబాద్ నగర్ ప్రథమ పౌరుడు గానీ ఎవరూ ట్రంప్‌కు ఆహ్వానం పలకడానికి విమానాశ్రయానికి చేరుకోలేదు. ప్రొటోకాల్ ప్రకారం.. గవర్నర్‌కు ఆ అవకాశాన్ని ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆయన విమానాశ్రయానికి రాలేదు. వారంతా నమస్తే ట్రంప్ కార్యక్రమానికి వేదికగా మారిన మొతేరా స్టేడియం వద్ద ట్రంప్‌కు స్వాగతం పలికే అవకాశం ఉంది.

    Modi greets Donald Trump, First Lady Melania at Ahmedabad airport

    ఈ సందర్భంగా విమానాశ్రయంలో అధికారులు ట్రంప్ కుటుంబ సభ్యులకు ఎర్ర తివాచీ స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పరిచయ కార్యక్రమాలు ముగిసిన అనంతరం అక్కడే అందుబాటులో ఉంచిన కాన్వాయ్‌ ద్వారా సబర్మతి ఆశ్రమం వైపునకు బయలుదేరి వెళ్లారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం మధ్య దూరం సుమారు 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 22 కిలోమీటర్ల పొడవునా ట్రంప్ కుటుంబానికి ఘనంగా స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అధికారులు.

    గుజరాతీ సంప్రదాయ నృత్యాలు, మల్లఖంబా వంటి ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. దారి పొడవునా కూడా వేలాది మంది గుజరాతీయులు భారత్, అమెరియా జాతీయ పతాకాలను చేత పట్టుకుని రోడ్డుకు ఇరు వైపులా నిల్చున్నారు. కాన్వాయ్‌కు స్వాగతం పలికారు. గంట పాటు ఈ రోడ్ షో కొనసాగుతుంది. అనంతరం మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలోొ వారంతా హాజరవుతారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+