ఇందిరా గాంధీ రికార్డు బద్దలు కొట్టిన మోదీ- జోష్.. బీజేపీలో ఖుష్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారు. వరుసగా ఎక్కువ కాలం పదవిలో ఉన్న భారత ప్రధానుల్లో రెండో స్థానానికి ఎగబాకారు. ఈ క్రమంలో ఆయన.. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును బద్దలు కొట్టారు. సుదీర్ఘకాలం భారత ప్రధానిగా పని చేసిన వారిలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ మొదటిస్థానంలో ఉన్నారు. 16 సంవత్సరాల 286 రోజుల పాటు నెహ్రూ ప్రధానిగా ఉన్నారు.
ఇందిరా గాంధీ 1966 జనవరి 24 నుండి 1977 మార్చి 24వ తేదీ వరకు అవిచ్ఛిన్నంగా 4,077 రోజులు ప్రధానమంత్రిగా కొనసాగారు. దీన్ని మోదీ చెరిపేశారు. శుక్రవారం నాటికి మొత్తం 4,078 రోజులు పూర్తి చేసుకున్నారు. తద్వారా ఆమె రికార్డును ఆయన అధిగమించినట్టయింది. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీలను విజయపథాన నిడిపించిన ఘనతను అప్పట్లో నెహ్రూ, ఇప్పుడు మోదీ సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వానికి ఎన్నికైన అధిపతిగా నరేంద్ర మోదీ ఇప్పటికే ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకూ కొనసాగారు. సుదీర్ఘకాలం పాటు పని చేసిన, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత జన్మించిన తొలి ప్రధానమంత్రి మోదీ కావడం విశేషం.
అంతే కాకుండా నాన్ కాంగ్రెస్ ప్రధానుల్లో ఎక్కువ కాలం పనిచేసిన నేత కూడా మోదీనే. గుజరాత్‌లో జన్మించిన మోదీ కేంద్ర ప్రభుత్వానికి అధిపతిగా రెండు పూర్తి పదవీ కాలాలు పూర్తి చేసిన కాంగ్రెసేతర నాయకుడిగా కూడా నిలిచారు. ఇదివరకు కాంగ్రెసేతర ప్రధానులెవరూ కూడా ఇంతకాలం పాటు పని చేయలేదనే విషయం తెలిసిందే.
2002, 2007, 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అధి నాయకుడిగా వరుసగా ఆరు ఎన్నికల్లో గెలిచిన ఏకైక వ్యక్తి మోదీ. గుజరాత్ ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన మోదీ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ద్వారా అంచెలంచెలుగా ఎదిగారు. బీజేపీలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా నిలిచారు.
ప్రజలతో మమేకం అయ్యే స్వభావం, ప్రజలను ఆకర్షించేలా ప్రసంగించడం, అలుపెరగకుండా శ్రమించే స్వభావం.. మోదీని ఈ స్థాయిలో నిలిపాయనేది విశ్లేషకుల అంచనా. 2014లో బీజేపీని చారిత్రాత్మక విజయం వైపు నడిపించే ముందు దశాబ్దానికి పైగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
-
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications