వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Modi: ప్రధాని టూర్, ఒక్కరోజు ముందు మోదీని ఇరుకున పెట్టిన మాజీ సీఎం, క్లారిటీ సార్ !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/బెంగళూరు: కర్ణాటక-మహారాష్ట్రాల సరిహద్దు వివాదం కొత్త మలుపు తిరిగింది. కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావడానికి డేట్ ఫిక్స్ చేశారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీని ఇరుకున పెట్టేశారు.

Lady techie: భార్యను ఫ్రెండ్స్ కు దానం చేసిన భర్త, బెడ్ రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిల్, మరదలు!Lady techie: భార్యను ఫ్రెండ్స్ కు దానం చేసిన భర్త, బెడ్ రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిల్, మరదలు!

శివసేన, ఎన్ సీపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలోని మహావికాస్ అఘాడి కూటమి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి బెళగావి విషయంలో జోక్యం చేసుకోవాలని మనవి చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలని శనివారం ఎన్ సీపీ నేతలు ఉన్నారు.

 Modi: PM Modi should clarify his stand on Maharashtra and Karnataka border row, says former CM Uddhav Thackeray.

అదే శనివారం రోజు ముంబాయిలో జరిగిన కాలేజ్ సమావేశంలో మాట్లాడిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ముంబాయి-నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ హైవే రహదారి ప్రారంభించడాకి ఇక్కడి వస్తున్నారని ఉద్దవ్ ఠాక్రే అన్నారు.

Wife: దుబాయ్ లో భర్త, ఉద్యోగం చేస్తున్న భార్యకు ?, దుబాయ్ నుంచి వచ్చి మొగుడు ఏం చేశాడంటే !

మరాఠీల తరపున ప్రధాని నరేంద్ర మోదీకి మేము స్వాగతం పలుకుతున్నామని మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్రకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బెళగావి సరిహద్దు వివాదంపై మరాఠీలకు పక్కా క్లారిటీ ఇచ్చి వెళ్లాలని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే సవాలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతున్నారని. బెళగావిలో మరాఠీలు ఎక్కువగా ఉన్న 814 ప్రజలతో చెలగాటం ఆడుతున్నారని మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆరోపించారు. బెళగావి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన వైఖరి ఆదివారం స్పష్టం చెయ్యాలని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.

English summary
Modi: PM Modi should clarify his stand on Maharashtra and Karnataka border row, says former CM Uddhav Thackeray.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X