4వేల కిలోల చెత్త: ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్‌పై మోడీ స్వచ్చభారత్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సైనికులు ఎవరెస్ట్ పైన నిర్వహించేందుకు పూనుకున్నారు. భారత సైనిక బృందం చేపట్టిన ఎవరెస్ట్ అధిరోహణ కార్యక్రమాన్ని సైనికాధిపతి జనరల్ దల్బీర్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సైనికులు అక్కడ ఉన్న 4వేల కిలోల చెత్తను తొలగించడం ద్వారా ఎవరెస్ట్ ప్రాంతాన్ని శుభ్రపరచనున్నారు. ఈ బృందానికి దల్బీర్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సైనికులు చెత్తను కిందకు తీసుకు రావడం ద్వారా ప్రధాని స్వచ్ఛ భారత్ సందేశాన్ని ముందుకు తీసుకెళ్తారన్నారు.

ఎవరెస్ట్ శిఖరం పైకి ఎక్కిన పర్వతారోధకులు వదిలేసిన నాలుగువేల కేజీల చెత్తను తీసుకు రానున్నారు. తద్వారా ప్రధాని చేపట్టిన స్వచ్ఛ భారత్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని తాకబోతుంది. స్వచ్చ భారత్ కోసం 34 మందితో కూడిన భారత ఆర్మీ బయలుదేరింది.












Click it and Unblock the Notifications