వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ బతుకుల్ని ఆగం చేసింది మోదీ, షానే.. దేశ యువతకు రాహుల్ గాంధీ సందేశం

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నాయంటూ ఢిల్లీ రాంలీలా మైదాన్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్న టైమ్ లోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా మాటల తూటాలు వదిలారు. ప్రధాని మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

అవును.. వాళ్లిద్దరే..
''డియర్ యూత్ ఆఫ్ ఇండియా.. మోడీ, అమిత్ షా ఇద్దరూ కలిసి మీ(యువత) భవిష్యత్తును నాశనం చేశారు. ఉద్యోగాలు ఇవ్వలేని స్థితిలో.. కనీసం ఎకానమీని కూడా కాపాడుకోలేని దుస్థితిలో వాళ్లిద్దరూ మీకు ముఖం చాటేస్తున్నారు. యూత్ నుంచి తప్పించుకొని తిరగడానికి మోడీ, షా 'ద్వేషం' అనే ముసుగు తొడుక్కున్నారు. దేశాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారు'' అని రాహుల్ ఆరోపించారు.

Modi, Shah destroyed countrys youth future says Rahul

మనకు మంచి చేసే మార్గమిదే..
మోడీ, షా కలిసి ధ్వంసం చేసిన దేశాన్ని తిరిగి ప్రేమతో నిర్మించుకుందామంటూ యువతకు రాహుల్ పిలుపునిచ్చారు. ''మనం ఒకరికొకరు అండగా నిలబడటం ద్వారా వాళ్ల కుట్రలను ఓడించొచ్చు''అని రాసుకొచ్చారు. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సోమవారం ఓ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మహాత్ముడి సమాధి రాజ్ ఘాట్ వద్ద రోజంతా ధర్నా నిర్వహించనున్నది. సోనియా, మన్మోన్ సింగ్, రాహుల్ గాంధీతోపాటు పలువురు ప్రముఖులు ఈ కర్యక్రమంలో పాల్గొననున్నారు.

English summary
Congress leader Rahul Gandhi on Sunday said Prime Minister Narendra Modi and Union Home Minister Amit Shah have 'destroyed' the future of the country's youth
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X