మోడీ డబుల్ గేమ్ చెబుతా, నాపై అప్పుడు అరిచారు: బీజేపీకి రాజీనామా చేసిన ఎంపీ
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి షాకిస్తూ ఆ పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎంపీ నానా పటోల్ కమలం పార్టీపై విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి గెలిచారు.
ఈ నెల 11వ తేదీన రాహుల్ గాంధీ అహ్మదాబాద్ ర్యాలీలో పాల్గొననున్నారు. శనివారం నానా పటోల్ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రధాని ఓబీసీ కార్డ్ ఉపయోగిస్తున్నారని చెప్పారు
చదవండి: గుజరాత్ ఎన్నికలు: ఆ ముస్లీంలు మోడీ వైపే, ఏందుకంటే? పటేళ్ల బదులు, ఇదీ బీజేపీ లెక్క

మోడీ బీసీ కార్డ్ వాడుతున్నారు
గుజరాత్ ఎన్నికల్లో లబ్ధి కోసం ఓబీసీ కార్డ్ వాడుతున్న ప్రధాని మోడీ వారికి, రైతులకు ఏమీ చేయలేదని నానా పటోల్ అన్నారు. నరేంద్ర మోడీ డబుల్ గేమ్ రాజకీయం ఆడుతున్నారని మండిపడ్డారు.

మోడీ ఇంటికి వెళ్లి సమస్యలు చెప్తే ఆగ్రహించారు
గత ఏడాది తను ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి వెళ్లినప్పుడు ఓబీసీల గురించి ఓ సమస్యను లేవనెత్తానని నానా పటోల్ చెప్పారు. ఆ సమయంలో మోడీ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఓబీసీల సమస్యలను అడగడంతో పాటు వారికి ఓ ప్రత్యేక మినిస్ట్రీ ఉండాలని సూచించానన్నారు.

ప్రధాని తనపై అరిచారు
అప్పుడు ప్రధాని మోడీ తనపై గట్టిగా అరిచారని నానా పటోల్ ఆరోపించారు. ఓబీసీలకు ఇప్పుడు ఇది అవసరమా, వారికి అలాంటిది ఏమీ అవసరం లేదని తనపై ఆగ్రహం వ్యక్తం చేసినంత పని చేశారని ఆరోపణలు చేశారు. అదే ప్రధాని ఇప్పుడు ఓబీసీ రాజకీయం చేస్తున్నారన్నారు.

డబుల్ గేమ్ ఆడుతున్నారు
తాను రైతుల సమస్యను లేవనెత్తిన సమయంలోను ప్రధాని మోడీ తనపై ఆగ్రహం వ్యక్తం చేసారని నానా పటోల్ చెప్పారు. కేంద్రం ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదన్నారు. మోడీ దేశ ప్రజలను మోసగించారన్నారు. తాను అహ్మదాబాదులో సోమవారం పర్యటిస్తానని, అప్పుడు మోడీ డబుల్ గేమ్ గురించి మాట్లాడుతానని చెప్పారు
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications