గుజరాత్ ఎన్నికలు: ఆ ముస్లీంలు మోడీ వైపే, ఏందుకంటే? పటేళ్ల బదులు, ఇదీ బీజేపీ లెక్క

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారం గురువారం ముగుస్తోంది. 182 స్థానాలకు గానూ 89 సీట్లకు ఈ నెల 9న ఎన్నికలు జరుగుతాయి. సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్‌, కచ్‌ ప్రాంతాల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం 977 మంది బరిలో ఉన్నారు. సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో అధిక స్థానాలు ఉండడంతో ఇక్కడ ఎక్కువ సీట్లు సంపాదించడం అన్ని పార్టీలకు ముఖ్యం.

బరిలో ఉన్న ప్రముఖుల్లో సీఎం విజయ్‌ రూపానీ ఉన్నారు. ఆయన రాజ్‌కోట్‌ (పశ్చిమ) నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఇంద్రనీల్‌ రాజ్యగురు పోటీ చేస్తున్నారు. వస్త్ర, వజ్రాల వ్యాపారానికి పట్టుగొమ్మలాంటి సూరత్‌లో జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం అధికంగా ఉంది. ఇక్కడ మోడీ, రాహుల్‌లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: వివిధ సంస్థల సర్వేల ఫలితాలు ఇలా

ఈ తెగ మాత్రం బీజేపీకి అనుకూలం

ఈ తెగ మాత్రం బీజేపీకి అనుకూలం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లీలంలలోని ఓ వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు ఎక్కడ ఎన్నికలు జరిగినా ముస్లీంలు గంపగుత్తగా బీజేపీని ఓడించేందుకు ప్రయత్నిస్తారు. కానీ గుజరాత్‌లో ఓ ముస్లీం తెగ మాత్రం బీజేపీకి అండగా నిలుస్తోంది. వీరు దావూదీ బోహ్రాలో షియా ఉప తెగకు చెందినవారు. వీరు ఎక్కువగా వాణిజ్య రంగంలో ఉంటారు.

అందుకే వారు మోడీకి మద్దతు

అందుకే వారు మోడీకి మద్దతు

2014లో నాడు నరేంద్ర మోడీ నాటి ప్రధాని అభ్యర్థిగా ముంబైలోని ఆ తెగ పెద్ద సయ్యద్‌నా ముఫద్దల్ సైఫుద్దీన్ ఇంటికి వెళ్లారు. అలాగే, మోడీ ప్రధాని అయ్యాక పీఎంవోకు వెళ్లి కలిసిన తొలి ముస్లీం మత పెద్ద కూడా ఇతనే. వీరు కేవలం అభివృద్ధి పైనే దృష్టి సారిస్తుంటారని, అందుకే మోడీ అంటే వారికి అభిమానం అంటుంటారు. బీజేపీకి, మోడీకి వారు మద్దతివ్వడానికి అభివృద్ధి పట్ల వారి వైఖరి కారణమని చెబుతున్నారు.

ఈసారి ఎవరికీ టిక్కెట్ ఇవ్వలేదు కానీ

ఈసారి ఎవరికీ టిక్కెట్ ఇవ్వలేదు కానీ

గతంలో ముస్లీం మెజార్టీ స్థానాల్లో పలుచోట్ల బీజేపీ ఆ వర్గాల అభ్యర్థిని బరిలోకి దింపితే ముస్లీంలోని ఇతర వర్గాలు కూడా మద్దతు ఇచ్చి బీజేపీ అభ్యర్థులను గెలిపించేవారు. ప్రస్తుత శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఎవరికీ టిక్కెట్ ఇవ్వలేదు. కానీ వారి అండను సంపాదించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

బీజేపీ లెక్కలు

బీజేపీ లెక్కలు

గుజరాత్‌లోని 30 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల ఆధిపత్యం ఉంటుంది. కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న ఈ నియోజకవర్గాల్లో పటేళ్ల ఓట్లు వల్ల కలగబోయే నష్టాన్ని భర్తీ చేసుకునేందకు బీజేపీ ముస్లీంలపై ఆధారపడుతుందనే తెలుస్తోంది. ఒక్కో చోట వెయ్యి నుంచి మూడు నాలుగు వేల ముస్లీంల ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థులు ఎక్కువ మంది గట్టెక్కుతారని అంటున్నారు. కాంగ్రెస్‌పై ముస్లింలలో ఉన్న అసంతృప్తి కూడా కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gujarat votes in two phases starting Saturday, when elections will be held for 89 seats. Voting will be held in the remaining 93 seats on December 14. Results will be announced on December 18, along with those for Himachal Pradesh, which voted in November.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి