today rashiphalalu: వక్రగతిలో బుధుడు, మీనంలో సూర్య, శుక్రులు.. వీరికి ఊహించని ఫలితాలు!
2026 మార్చి 16 సోమవారం నాడు ముఖ్య గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. నేడు సాయంత్రం చంద్రుడు కుంభ రాశిలో ప్రవేశిస్తాడు. నేడు సూర్యుడు మరియు శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. బుధుడు వక్రగతి లో ఉండటం వల్ల నేడు కొన్ని రాశుల వారు జాగ్రత్తలు వహించాలి.
నేడు ముఖ్య గ్రహాల సంచారం
మకర రాశి వారికి, మకర రాశి నుండి కుంభ రాశిలోకి చంద్రుడి సంచారం కారణంగా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేడు ముఖ్య గ్రహాల రవాణాతో ద్వాదశ రాశుల వారి జీవితం ఏ విధంగా ప్రభావితం అవుతుందో చూద్దాం.

మేషం
నేడు మేషరాశి జాతకులకు ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఖర్చుల్లో జాగ్రత్త అవసరం. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది.
వృషభం
వృషభ రాశి జాతకులకు నేడు ఆర్థికంగా కొంత లాభం ఉంటుంది. కుటుంబ విషయాల్లో ఆనందం ఉంటుంది. వృషభ రాశి జాతకులు అన్ని విషయాలలోనూ నేడు నేడు విజయాలను చూస్తారు.
మిథునం
మిధున రాశి వారికి పనిలో ఒత్తిడి ఉండవచ్చు. వీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించడం మంచిది.
కర్కాటకం
కర్కాటక రాశి జాతకులకు నేడు ప్రయాణాలకు అనుకూల సమయం. వీరికి కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చు.
సింహం
సింహరాశి జాతకులకు ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. వ్యాపారులకు మంచి రోజు. ఈరోజు వర్తక వ్యాపారాలు చేసేవారు ఊహించని లాభాలను గడిస్తారు.
కన్యా
కన్యా రాశి జాతకులకు నేడు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబంతో సమయం గడపడం మంచిది.
తులా
తులా రాశి జాతకులకు పనుల్లో పురోగతి ఉంటుంది. కొత్త ప్రణాళికలు ప్రారంభించవచ్చు. ఈరోజు వీరికి కలిసి వస్తుంది
వృశ్చికం
వృశ్చిక రాశి జాతకులకు పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. స్నేహితుల సహాయం లభిస్తుంది. అనుకూలంగా ఉంది.
ధనుస్సు
ధనుస్సు రాశి జాతకులు నేడు గ్రహ సంచారాల కారణంగా కుటుంబ విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
మకరం
మకర రాశి జాతకులకు నేడు ఉద్యోగంలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. వీరికి నేడు ఏ పని చేసినా కలిసి వస్తుంది.
కుంభం
కుంభరాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. నేడు వీరికి అనుకూలంగా ఉంటుంది.
మీనం
మీనరాశి జాతకులకు ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో శాంతి ఉంటుంది. అన్ని విధాల ప్రయోజనాలు చేకూరుతాయి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications