ఆస్కార్ లో సిన్నర్స్ ప్రభంజనం- ఆ వెటరన్ హీరో ఖాతాలో మూడోసారి అవార్డ్
Oscar Awards 2026: హాలీవుడ్‌లో బిగ్గెస్ట్ వేడుక.. ఆస్కార్ అవార్డుల సందడి గ్రాండ్‌గా ఆరంభమైంది. ఇది 98వ ఎడిషన్. భారత కాలమాన ప్రకారం ఈ తెల్లవారు జామున సరిగ్గా 5:30 గంటలకు ఈ ప్రదానోత్సవం ప్రారంభమైంది. అమెరికా కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్ దీనికి వేదిక. అమెరికాకు చెందిన ప్రముఖ కమేడియన్, రైటర్, టెలివిజన్ హోస్ట్ కానన్ ఓబ్రియాన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించారు. తన దైన శైలిలో నవ్వులు పూయించారు. కానన్.. ఆస్కార్ కు కామెంటేటర్ గా వ్యవహరించడం వరుసగా ఇది రెండోసారి.
భారత్ కు చెందిన హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈ కార్యక్రమంలో మెరిశారు. భర్త జొనాస్ తో కలిసి సందడి చేశారు. ఈ ఏడాది అవార్డులను అందించే వారిలో ఉన్నారామె. ఈ ఆస్కార్ రేసులో ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన సినర్స్ 16 నామినేషన్లతో రికార్డు సృష్టించింది. పాల్ థామస్ అండర్సన్ రూపొందించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 13 నామినేషన్లతో గట్టిపోటీ ఇస్తోంది. ఈ రెండు చిత్రాలు ఈసారి అవార్డుల సీజన్‌లో ప్రధానంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

గత ఏడాది అవార్డులు గెలుచుకున్న వారిలో ది బ్రూటలిస్ట్ కు అడ్రియన్ బ్రాడీ, అనోరాకు మైకీ మాడిసన్, ఎమిలియా పెరెజ్ కు జో సల్డానా సైతం ప్రజెంటర్ల జాబితాలో నిలిచారు. వీరితో పాటు క్రిస్ ఎవాన్స్, విల్ ఆర్నెట్, చేజ్ ఇన్ఫినిటి, రాబర్ట్ డౌనీ జూనియర్, అన్నే హాథావ్‌వే, డెమి మూర్, కుమాయిల్ నంజియాని వంటి అగ్ర తారలు కూడా అవార్డులను అందించనున్నారు.
ఆస్కార్స్ 2026 విజేతలు:
ఉత్తమ సహాయ నటి: అమీ మాడిగన్- వెపన్స, యానిమేటెడ్ ఫీచర్: కె-పాప్ డెమోన్ హంటర్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హూ క్రైడ్ పెర్ల్స్, కాస్ట్యూమ్ డిజైన్: కేట్ హ్యాలీ- ఫ్రాంకెన్‌స్టీన్, మేకప్ అండ్ హెయిర్ స్టెయిలింగ్: మైక్ హిల్, జోర్డాన్ శామ్యూల్, క్లియోనా ఫ్యూరీ ఫ్రాంకెన్‌స్టీన్, కాస్టింగ్ డైరెక్టర్: కాసండ్రా కులుకుండిస్- వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్ ఎక్స్ఛేంజింగ్ సలైవా. ఈ కేటగిరీలో ఈ రెండూ ఈ అవార్డుకు అందుకున్నాయి.
ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: సినర్స్- ర్యాన్ కూగ్లర్, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్- పాల్ థామస్ అండర్సన్, ప్రొడక్షన్ డిజైన్: ఫ్రాంకెన్‌స్టీన్, విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ఫైర్ అండ్ యాష్
ఉత్తమ సహాయ నటుడిగా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రానికి అవార్డు గెలుచుకున్నప్పటికీ షాన్ పెన్ ఆస్కార్ వేడుకకు హాజరు కాలేదు. గతంలో డెడ్ మ్యాన్ వాకింగ్, స్వీట్ అండ్ లోడౌన్, ఐయామ్ సామ్ నామినేషన్ల సమయంలో, ఈ ఏడాది బాఫ్టా, యాక్టర్ అవార్డులకూ ఆయన గైర్హాజరయ్యారు. కాగా షాన్ పెన్‌కు లభించిన మూడవ అకాడమీ అవార్డు. గతంలో ఉత్తమ నటుడిగా 2003 లో మిస్టిక్ రివర్, 2008లో మిల్క్ సినిమాలకు రెండు ఆస్కార్‌లు గెలుచుకున్నాడు.
ఉత్తమ నటి విభాగంలో జెస్సీ బక్లీ విజయం సాధిస్తారని బలంగా అంచనా వేస్తున్నారు. ఉత్తమ నటుడి రేసులో టఫ్ ఫైట్ ఉంది. మైఖేల్ బీ జోర్డాన్, లియోనార్డో డికాప్రియో, తిమోతీ చలమెట్, వాగ్నర్ మౌరా పోటీ పడుతున్నారు.
-
ఖమేనీ ఆచూకీ చెప్పిన వారికి కోటి డాలర్లు -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications