మహేష్ బాబు ఛాన్స్ కొట్టేశాడు పో

హాలీవుడ్‌లో బిగ్గెస్ట్ వేడుక.. ఆస్కార్ అవార్డుల సందడి గ్రాండ్‌గా ఆరంభమైంది. ఇది 98వ ఎడిషన్. భారత కాలమాన ప్రకారం ఈ తెల్లవారు జామున సరిగ్గా 5:30 గంటలకు ఈ ప్రదానోత్సవం ప్రారంభమైంది. అమెరికా కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్ దీనికి వేదిక. అమెరికాకు చెందిన ప్రముఖ కమేడియన్, రైటర్, టెలివిజన్ హోస్ట్ కానన్ ఓబ్రియాన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించారు. తన దైన శైలిలో నవ్వులు పూయించారు. కానన్.. ఆస్కార్ కు కామెంటేటర్ గా వ్యవహరించడం వరుసగా ఇది రెండోసారి.

భారత్ కు చెందిన హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈ కార్యక్రమంలో మెరిశారు. భర్త జొనాస్ తో కలిసి సందడి చేశారు. ఈ ఏడాది అవార్డులను అందించే వారిలో ఉన్నారామె. గత ఏడాది అవార్డులు గెలుచుకున్న వారిలో ది బ్రూటలిస్ట్ కు అడ్రియన్ బ్రాడీ, అనోరాకు మైకీ మాడిసన్, ఎమిలియా పెరెజ్ కు జో సల్డానా సైతం ప్రజెంటర్ల జాబితాలో నిలిచారు. వీరితో పాటు క్రిస్ ఎవాన్స్, విల్ ఆర్నెట్, చేజ్ ఇన్ఫినిటి, రాబర్ట్ డౌనీ జూనియర్, అన్నే హాథావ్‌వే, డెమి మూర్, కుమాయిల్ నంజియాని వంటి అగ్ర తారలు కూడా అవార్డులను అందించనున్నారు.

Priyanka Chopra-Nick Jonas Light Up Oscars 2026 and Presence as Isha Ambani Steals the Spotlight

రెడ్‌కార్పెట్‌పై ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ జంట మెరుపులు మెరిపించింది. ప్రియాంక స్ట్రాప్‌లెస్ వైట్ డియోర్ గౌన్ లో కనిపించారు. హై-లెగ్ స్లిట్, బ్లాక్ అండ్ వైట్ రఫుల్స్ ట్రెయిల్ దీని ప్రత్యేకత. అదే రేంజ్ లో బ్లాక్ హీల్స్, మిరుమిట్లు గొలిపే డైమండ్ నెక్లెస్, చెవిపోగులతో కంప్లీట్ మేకోవర్ అయ్యారు. క్లాసిక్ బ్లాక్ టక్సేడో, వైట్ షర్ట్, బ్లాక్ బో టై ధరించాడు నిక్. రెడ్‌కార్పెట్‌పై ఘన స్వాగతం లభించింది వీరికి.

2016లో మొదటిసారి ప్రెజెంటర్‌గా వ్యవహరించారామె. 2021లో ఆస్కార్ తో అనుబంధం ఉన్నప్పటికీ.. అప్పట్లో నామినేషన్లను ప్రకటించడం వరకే పరిమితం అయ్యారు. సెలబ్రేషన్స్ ఆరంభానికి ముందు డ్రెస్సింగ్ రూమ్ నుండి కొన్ని ఫొటోలను విడుదల చేశారు. వైట్ గౌన్ లో పర్సనలైజ్డ్ ట్యాగ్, స్టైలిస్ట్ తుది మెరుగులు దిద్దుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ప్రస్తుతం ఆమె మహేష్ బాబు సరసన వారణాసిలో నటిస్తోన్నారు.

ఇదే వేడుకకు ఈషా అంబానీ హాజరయ్యారు. ఓ వింటేజ్ లుక్ లో అదరగొట్టారు. మేసన్ వాలెంటినో డిజైన్ చేసిన గౌన్ ను ధరించారామె. ఫాల్ 2006 కౌచర్ కలెక్షన్ లో టాప్ లో నిలిచిందీ డిజైన్. లేత గులాబీ, ఐవరీ, నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఫ్లోరల్ ఎంబ్రాయిడరీలో డిజైన్ చేశారు దీన్ని. ఆస్కార్ వేడుకలకు ముందు, ఈషా లాస్ ఏంజిల్స్‌లో మ్యూజియం డైరెక్టర్ అమీ హోమ్మాతో సమావేశమయ్యారు. ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, ఆస్కార్ అకాడమీ మధ్య పలు అంశాలపై సంప్రదింపులు జరిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+