బేబీ ఆలూతో కర్రీ.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు..!

సాధారణ ఆలూతో కర్రీ చేసుకుంటాం. ఆలూ ఫ్రై, ఆలూ కుర్మా ఇలా రకరకాలుగా చేసుకుంటారు. అయితే ఆలూ కంటే కూడా బేబీ ఆలూలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆలూ కర్రీ టేస్ట్ లోనూ సాధారణ ఆలూ కంటే బ్రహ్మాండంగా ఉంటుందని వివరిస్తున్నారు. మరి ఈ టేస్టీ ఆలూ కర్రీ తయారీ విధానం ఏంటి..? కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం..

బేబీ ఆలూ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. చిన్న ఆలు గడ్డలు (బేబీ ఆలూ) అరకిలో, టొమాటో గుజ్జు అర కప్పు, కారం ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, నూనె సరిపడా, కొత్తిమీర తరుగు పావు కప్పు, పసుపు చిటికెడు, పెరుగు ఒక కప్పు, చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక టీస్పూన్ తీసుకోవాలి.

ఇప్పుడు బేబీ ఆలూ కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా ఆలు గడ్డలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆలు గడ్డలను పొట్టు తీసి చాకు లేదా గరిటెతో అక్కడక్కడా గాట్లు పెట్టుకోవాలి. అలా నిమ్మరసం, ఉప్పు కలుపుకుని పావుగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో పెరుగు, చాట్ మసాలా, పసుపు, గరం మసాలా, ఉప్పు, కారం వేసి బాగా మేరినేట్ చేసుకోవాలి.

BabyPotato Curry Recipe home made recipe tasty Cook This Way amp amp Everyone Will Beg for Seconds

ఇప్పుడు ఆ మిశ్రమంలో ఆలు గడ్డలను వేయాలి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని నూనె వేసి వేడిచేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆలు గడ్డల మిశ్రమాన్ని వేయాలి. అలా వేగనిచ్చి రెండు నిమిషాల తర్వాత టమాటో గుజ్జును వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ దగ్గరికి ఉడికిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర చల్లితే సరి.. సూపర్ టేస్టీ బేబీ ఆలూ కర్రీ రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+