ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..?

హైదరాబాద్ లో ఉన్న పర్యాటక ప్రాంతాలను చూసి బోర్ కొట్టిందా..? అయితే తక్కువ ధరకే వరల్డ్ లోనే చీపెస్ట్ కంట్రీకి వెళ్లొద్దామా..? చాలామంది విదేశీ ట్రిప్ అనగానే బ్యాంకాక్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ ఇలా రకరకాల ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే ఈ దేశాలకంటే చీపెస్ట్ కంట్రీగా పేరుపొందినది లావోస్. ఆసియా ఖండంలో గల ఈ పర్యాటక ప్రదేశం చూపరులను ఇప్పుడు విశేషంగా ఆకట్టుకుంటోంది. భారత్ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈ టూరిస్ట్ ప్రాంతానికి వెళ్తుంటారు.

బడ్జెట్ లో విదేశీ ట్రిప్ చేయాలనుకునే వారికి ఇదో బెస్ట్ ట్రావెల్ స్పాట్ అని చెప్పొచ్చు. ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీగా లావోస్ పేరుగాంచింది. థాయిలాండ్, వియత్నాం మధ్యలో ఉన్న లావోస్.. ఎంతో ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తోంది. లావోస్ లో జలపాతాలు, గుహలు, నదులు, ఎత్తయిన పర్వతాలు పర్యటకులను కనువిందు చేస్తుంటాయి. అలాగే లావోస్ లో తక్కువ ధరకే ఫుడ్, వసతి, ట్రావెల్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అందువల్ల బడ్జెట్ లవర్స్ కు, అడ్వెంచర్ ప్రేమికులకు ఇదో స్వర్గధామంగా ఉంటుంది.

లావోస్ చేరుకోవాలంటే టూరిస్టులు మామూలుగా హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ లేదా కౌలాలంపూర్ చేరుకోవాలి. ఆ తర్వాత అక్కడినుంచి లావోస్ కు కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా లావోస్ కు వెళ్లాలి. రౌండ్ ట్రిప్ విమానం టికెట్స్ ధరలు సాధారణంగా రూ. 25 వేలు నుంచి రూ. 45 వేలు వరకు ఉంటాయి. సీజన్ ప్రకారం ఈ ధరలు మారుతుంటాయి. ఇక లావోస్ లోనే దాదాపు నెల రోజులు ఉండేందుకు వీసా ఖర్చులు రూ. 3 వేలు నుంచి రూ. 3, 500 వరకు ఉంటాయి.

Hyderabad to Laos country tour on a Budget Explore the Cheapest Country in the World Affordably

ఇక లావోస్ లో చాలా మంది టూ వీలర్స్ ను రెంట్ కు తీసుకుని కంట్రీ సైడ్ రోడ్ జర్నీ చేసుకుంటూ ఆ దేశ అందాలను ఆస్వాదిస్తారు. చిన్న చిన్న గ్రామాలు, పర్వతాల నుంచి వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక పర్యటకుల కోసం డార్మిటరీ హాస్టల్స్ ఇక్కడ రాత్రి బసకు రూ.300 తీసుకుంటారు. ఫుడ్ కూడా చాలా తక్కువ ధరకే లభ్యం అవుతుంది. ఆహారం ఖర్చు రూ. 200 నుంచి రూ. 300 పర్ డే ఉంటుంది. ఈ ప్రాంతానికి హైదరాబాద్ నుంచే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+