• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో మార్పులు చేశాం...రాష్ట్రాలకు తెలిపిన కేంద్రం

|

ఢిల్లీ: ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం కాకుండా ..విచారణ లేకుండా అరెస్టులు కాకుండా చూస్తామంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే కేంద్రం అన్ని రాష్ట్రాలకు మరో రకమైన ఆదేశాలు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీలపై ఏదైనా ఘటన జరిగితే ఎలాంటి విచారణ లేకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని...లేదా అరెస్టుకు ముందు పై అధికారులు అనుమతి తీసుకోవాలన్న నిబంధనను రద్దు చేస్తూ పార్లమెంటు చట్టం చేసిందని తెలుపుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది.

ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ వర్తించదు

ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఇంకా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీపై పాత పద్దతినే అవలంబిస్తున్నాయన్న రిపోర్టు కేంద్రం దృష్టికి రావడంతో కేంద్రం ఈ మేరకు లేఖ రాసింది. ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో ఇంకా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పాత చట్టంనే అమలు చేస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం చాలా సున్నితమైన అంశం కాబట్టి..గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశవ్యాప్తంగా పలు ఆందోళనలు నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దళితుల ఓట్లకోసమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సవరించిందని...అగ్రవర్ణాలు, ఓబీసీల సమస్యలను విస్మరించిందని అగ్రకులాల వారు విమర్శించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడంతో పార్లమెంటు ఆగష్టు 9న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సవరించింది.

Modifications done in SC/ST law, Centre alerts states

సవరించిన కొత్త చట్టం ప్రకారం కొత్తగా సెక్షన్ 18ఏను చేర్చింది కేంద్రం. దీని ప్రకారం ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగితే ఎలాంటి విచారణ లేకుండా సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. 2017 నేషనల్ క్రైం బ్యూరో సమాచారం మేరకు 2015 నుంచి 2016 మధ్య దళితులపై దాడులు 5.5 శాతానికి పెరిగాయని పేర్కొంది. అంటే 38,670 నుంచి 40,801కి పెరిగినట్లు రిపోర్ట్ స్పష్టం చేసింది. అదే ఎస్టీలపై దాడులు 4.5 శాతం పెరిగాయి. అంటే 6,276 నుంచి 6568కి చేరింది. ఇక దళిత మహిళలపై అత్యాచార కేసులు ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్ (557)లో నమోదవగా... ఆదివాసీలపై అత్యాచారాలు మధ్యప్రదేశ్(377), ఛత్తీస్‌ఘడ్(157), ఒడిషా (91)కేసులు నమోదయ్యాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Days after Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan announced he will ensure that the newly amended Scheduled Castes and Scheduled Tribes (Prevention of Atrocities) Act is “not misused” and that no one is arrested before an investigation, the Union Home Ministry has written to states and Union Territories clarifying that Parliament has amended the Act “to nullify” conduct of a preliminary enquiry before registration of an FIR, or to seek approval of any authority prior to the arrest of an accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more