యోగి ఆదిత్యనాథ్‌కు క్రికెటర్ మహమ్మద్ కైఫ్ వినూత్నంగా..

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభినందనలు తెలిపారు. భారతీయ జనతా పార్టీలో హిందుత్వ నేతగా గుర్తింపు పొందిన ఆయనకు మంచి జరగాలని ఆకాంక్షించారు.

అలహాబాదుకు చెందిన కైఫ్.. ట్విట్టర్లో స్పందించారు. ప్రతి ఒక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలపై అఫ్పటికప్పుడు అనుమానాలు వ్యక్తం చేసే కంటే వారికి శుభాకాంక్షలు చెప్పడం మంచిదన్నారు.

Mohammad Kaif's Message After Yogi Adityanath Took Over as UP Chief Minister

వారి హయాంలో భారత్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

మరో ట్వీట్లో యోగి ఆదిత్యనాథ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పాలనలో యూపీ అభివృద్ధి సాధించాలని, ప్రజలకు ఆయన గొప్ప భవిష్యత్తును ఇస్తారని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian cricketer Mohammad Kaif, however, steered clear from making any negative remarks on the 46-year-old's appointment. Taking to Twitter, Kaif advised his fans to remain optimistic and wish the new government well.
Please Wait while comments are loading...