వయనాడ్ బాధితులకు సుకేష్ చంద్రశేఖర్ ఎంతిచ్చాడో తెలిస్తే షాకవుతారు!!
కేరళలోని వయనాడ్ కొండ చరియలు విరిగిపడిన భీభత్సం దేశాన్ని మొత్తాన్ని కలచివేసింది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కోల్పోవటం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవించేలా చేసిన ఈ ప్రకృతి విలయంలో ఇంకా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
వయనాడ్ విషాదం..
జులై 26వ తేదీన వయనాడ్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో వందల సంఖ్యలో ప్రాణాలను కోల్పోగా, వేల మంది మంది ప్రజలు గాయపడ్డారు. కేరళలో జరిగిన ప్రకృతి ప్రకోపంతో చేసిన విలయ తాండవం నుండి ఇంకా వయనాడ్ బయట పడలేదు. ఎన్డీఆర్, ఎస్డీఆర్ఎఫ్, కేరళ అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది, మృతదేహాలను వెలికి తీసే పనిలో ఉన్నారు. బురద తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు బయటపడుతున్న హృదయ విదారక పరిస్థితి ఉంది.

వయనాడ్ బాధితులకు సుకేష్ చంద్రశేఖర్ భారీ విరాళం
అయితే కేరళ వయనాడ్ బాధితుల కోసం దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కూడా బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించాడు. 15 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి తన విరాళంగా ప్రకటించిన సుఖేష్ చంద్రశేఖర్ తాను పంపే పదిహేను కోట్ల రూపాయలను అంగీకరించవలసిందిగా కేరళ సీఎం పినరయి విజయన్ కు లేఖ రాశాడు.
చట్ట బద్ధంగా సంపాదించిందే అంటూ లేఖ
అంతేకాదు బాధితులకు తక్షణ ప్రాతిపదికన 300ఇళ్లు నిర్మించడానికి మరింత సహాయం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు సుఖేష్ తన లేఖలో పేర్కొన్నారు. చట్టబద్ధమైన వ్యాపారఖాతాల నుంచి సహకారం అందిస్తున్నట్టు, సుఖేష్ చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నాడు. తాను ఇస్తున్న ఈ భారీ విరాళాన్ని అంగీకరించి కొండ చరియలు విరిగిపడిన విషాదంలో ప్రభావితమైన వారి సంక్షేమాన్ని చూడాలని, వారికి పునరావాసం కల్పించడానికి ఈ డబ్బును వినియోగించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
వయనాడ్ విలయంలో 400మందికిపైగా మృతి
కేరళలోని వయనాడ్ విలయం లో ఇప్పటికి నాలుగు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో గాయపడిన వారు ఇప్పుడిప్పుడే ఆసుపత్రులలో కోలుకుంటున్నారు. ఇంకా వయనాడ్ లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications