Monsoons: రైతులకు శుభవార్త.. మే 19న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి రుతుపవనాలు..
రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే వస్తాయని తెలిపింది. దీంతో తీవ్ర ఎండ, ఉక్కపోతతో బాధపడుతున్న వారు రుతుపవనాల రాకతో ఉపశమనం పొందుతారు. ముందుగా రుతుపవనాలు రావడం వల్ల రైతులు ముందుగానే పంటలు వేసుకోవచ్చు. ఈసారి నైరుతి రుతుపవనాలు మే 19 వరకు దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని పక్కనే ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లో ప్రవేశిస్తాయని ఐఎండీ అంచనా వేసింది. సాధారణంగా ఈ ప్రాంతాల్లోకి రుతుపవనాలు మే 22 వరకు వస్తాయి. ఈసారి మూడు రోజులు ముందుగానే వస్తున్నాయి.
ప్రతి సంవత్సరం రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయి. జూలై 15 నాటికి దేశమంతట విస్తరిస్తాయి. జూన్ నుంచి సెప్టెంబరు మధ్య దేశంలో రుతుపవనాల వర్షపాతం దీర్ఘ కాల సగటు (LPA)లో 106% వద్ద "సాధారణం కంటే ఎక్కువ" ఉండవచ్చని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు 2024 మే 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని IMD సోమవారం తెలిపింది.

దీనితో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు (40-50kmph) ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ & నికోబార్ దీవుల మీదుగా వచ్చే ఏడు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో విస్తారంగా వర్షాలు, మెరుపులు మరియు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా వచ్చే ఐదు రోజుల్లో వానలు పడే అవకాశం ఉంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications