వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యానా ? అమెరికానా ?-భారత్ కు కఠిన పరీక్ష-ఈ వారంలో ఢిల్లీకి ఇరుదేశాల ప్రతినిధులు

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయంగా తటస్ధ వైఖరితో నెట్టుకొస్తున్న భారత్ కు త్వరలో అగ్నిపరీక్ష ఎదురుకాబోతోంది.ఇప్పటివరకూ తటస్ధ వైఖరితో అగ్రరాజ్యాన్నింటితోనూ సత్సంబంధాలు నెరుపుతున్న భారత్.. ఇకపై రెండు కీలక శక్తులు అమెరికా, రష్యాల్లో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన పరిస్దితులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. అలా కాకుండా రెండు దేశాలతోనూ తటస్ధ వైఖరి కొనసాగిస్తామంటే అవి ఒప్పుకునేలా లేవు. ఈ వారంలో రెండు దేశాల ప్రతినిధులు భారత్ వైఖరి తెలుసుకునేందుకు ఢిల్లీకి వస్తున్నారు.

భారత్ తటస్ధ వైఖరి

భారత్ తటస్ధ వైఖరి

అంతర్జాతీయంగా దశాబ్దాలుగా భారత్ తటస్ధ వైఖరి అవలంబిస్తూ వస్తోంది. అంటే ఎవరికీ పూర్తిస్ధాయిలో మిత్రుడు కాకుండా శత్రువు కూడా కాకుండా నెట్టుకొస్తోంది. తద్వారా అన్ని దేశాల నుంచి లబ్ది పొందే వ్యూహం అనుసరిస్తోంది. కానీ పొరుగుదేశాలతో పాటు పలు దేశాలు మాత్రం భారత్ విషయంలో అంత సానుకూల ధోరణి ప్రదర్శించడం లేదు.
ఎందుకంటే ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్ధితుల్లో అగ్రరాజ్యాలు తమకు ఇతర దేశాలు పూర్తిగా అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాయి. దీంతో భారత్ వంటి దేశాలకు ఇబ్బందులు తప్పడం లేదు.

 భారత్ కు రష్యా విదేశాంగమంత్రి

భారత్ కు రష్యా విదేశాంగమంత్రి


ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ పోరు నేపథ్యంలో భారత్ తటస్ధ వైఖరి అంతర్జాతీయంగా మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను ప్రపంచదేశాలన్నీ ఖండిస్తుంటే భారత్ మాత్రం యుద్ధం వద్దని రష్యాకు సుద్దులు చెప్పడానికే పరిమితమవుతోంది. అంతే కాదు ఆంక్షలున్నా రష్యా నుంచి చమురు కొంటోంది. దీంతో భారత్ వైఖరిపై పశ్చిమ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు, భారత్ మద్దతు పొందేందుకు రష్యా తన విదేశాంగమంత్రి లావ్ రోవ్ ను ఈ వారాంతంలో ఢిల్లీకి పంపుతోంది. ఆయన ప్రధాని మోడీతో భేటీ అయి రష్యాకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరబోతున్నారు. లావ్‌రోవ్ ఢిల్లీ పర్యటన ఉక్రెయిన్‌లో రష్యా చర్య, శాంతి చర్చల గురించి ప్రభుత్వానికి వివరిస్తుందని, భారత్ కు డిస్కౌంట్ చమురుపై రష్యా ఇచ్చిన ఆఫర్‌పై చర్చిస్తారని ప్రభుత్వం పేర్కొంది.

 రేపే ఢిల్లీకి యూఎస్ డిప్యూటీ ఎన్ఎస్ఏ

రేపే ఢిల్లీకి యూఎస్ డిప్యూటీ ఎన్ఎస్ఏ

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ రష్యాకు మద్దతుగా వ్యవహరిస్తూ పైకి మాత్రం తటస్ధ వైఖరి అంటూ డబుల్ గేమ్ ఆడుతోందని యూఎస్ భావిస్తోంది. దీంతో భారత్ భయపడుతోందంటూ ఇప్పటికే యూఎస్ అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బైడెన్ సర్కార్.. తమ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారును భారత్ తో చర్చల కోసం పంపుతోంది. రేపే ఆయన ఢిల్లీకి రాబోతున్నారు. ఈ వారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ పర్యటనకు ముందు, బిడెన్ సర్కార్ ఉక్రెయిన్‌లో యుద్ధం కోసం రష్యాపై ఆంక్షలపై తన ప్రధాన వ్యూహకర్త దలీప్ సింగ్ ను పంపుతోంది. యూఎస్ డిప్యూటీ ఎన్ఎస్ఏ పర్యటన కూడా బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్‌తో సమానంగా ఉంటుంది. ఆయన సౌత్ బ్లాక్‌లోనే సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే రష్యాపై ఆంక్షల సహా ఉక్రెయిన్ పోరుపై యూఎస్ వైఖరిలో కీలకంగా ఉన్న దలీప్ సింగ్.. భారత్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్ కు కఠిన పరీక్ష ?

భారత్ కు కఠిన పరీక్ష ?

ఇప్పటివరకూ తటస్ధ వైఖరితో నెట్టుకొస్తున్న భారత్ కు ఈ వారంలో యూఎస్, రష్యా ప్రతినిధుల రాకతో తమ వైఖరి స్పష్టం చేయాల్సిన పరిస్దితి ఎదురవుతోంది. అయితే వీరికి ఈసారి తటస్ధ వైఖరిని గుర్తుచేస్తే సరిపోయేలా లేదు. భారత్ ఇదే వైఖరి ప్రదర్శిస్తే భవిష్యత్తులో తమ వ్యూహాలు తమకు ఉంటాయనే సందేశంతో యూఎస్, రష్యా ప్రతినిధులు ఢిల్లీకి వస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే భారత్ ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్ధితులు ఎదురవుతాయి. ఇప్పటివరకూ రష్యా నుంచి దాదాపు 60 శాతం ఆయుధ సామాగ్రి, సైనిక సామాగ్రి తీసుకుంటున్న భారత్.. యూఎస్ నుంచీ భారీ కొనుగోళ్లు చేస్తోంది. కానీ ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలతో ఇప్పుడు ఆయుధ సామాగ్రి కోసం వీరిద్దరిలో ఎవరిని ఎంచుకుంటే మేలన్న దానిపై చర్చలు జరపాల్సి ఉంది. ఈ మేరకు భారత్ పై ఒత్తిడి పెరుగుతోంది.

English summary
ahead of russian foreign minister lavrov's arrival, us president joe biden also sent their deputy nsa to india this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X