వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పానీపూరీ తిని 100మందికి పైగా డయేరియా.. అయినా సరే తినాలనుకుంటే మీ ఇష్టం!!

|
Google Oneindia TeluguNews

వర్షాకాలంలో ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది తినొద్దు, ముఖ్యంగా పానీపూరీల జోలికి పోవద్దని వైద్యులు చెప్పినా, మన గురించి కాదులే అనుకుని చాలా మంది పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది తింటూ ఉంటారు. ఇక అటువంటి వారికోసమే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన.

Recommended Video

పానీపూరీ తిని 100మందికి పైగా? అయినా తినాలనుకుంటే మీ ఇష్టం *National | Telugu OneIndia
పానీపూరీ తిన్న 100 మందికి పైగా అస్వస్థత

పానీపూరీ తిన్న 100 మందికి పైగా అస్వస్థత


పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని సుగంధ గ్రామ పంచాయతీలోని డోగాచియా ప్రాంతంలోని వీధి దుకాణంలో చాలా మండి పానీపూరీ తిన్నారు. అక్కడ పానీ పూరీ తిన్న 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధిత వ్యక్తులు అతిసారంతో ఇబ్బంది పడుతున్నారు. విరోచనాలు, వాంతులు మరియు కడుపు నొప్పితో విలవిలలాడుతున్నారు. పానీపూరీ తినటం వల్లే అని వారు గుర్తించారు,

పానీపూరీ తిన్న 3గ్రామాలకు చెందిన ప్రజలకు డయేరియా

పానీపూరీ తిన్న 3గ్రామాలకు చెందిన ప్రజలకు డయేరియా

సమాచారం అందుకున్న వైద్యఆరోగ్య శాఖ అధికారుల ప్రత్యేక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రోగులకు మందులు అందించారు. కొందరు తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతున్న కారణంగా వారిని ఆసుపత్రులకు తరలించారు. వారంతా డయేరియా బారిన పడినట్టుగా వైద్యాధికారులు గుర్తించారు. మొత్తం మూడు గ్రామాలకు చెందిన ప్రజలు సుగంధ గ్రామ పంచాయతీలోని డోగాచియా ప్రాంతంలో ఓ స్ట్రీట్ స్టాల్ లో పానీపూరి తిన్నారు. అస్వస్థతకు గురైన వ్యక్తులు డోగాచియా, బహిర్ రణగాచా మరియు మకల్తలా నివాసితులుగా తెలుస్తుంది.

మే నెలలో మధ్యప్రదేశ్ లోనూ ఇలాంటి ఘటనే

మే నెలలో మధ్యప్రదేశ్ లోనూ ఇలాంటి ఘటనే

మే నెలలో కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పానీపూరి తినడం వల్ల 97 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. మండలా జిల్లా లో సింగర్పూర్ లో జరిగిన ఓ జాతరకు వెళ్లిన పిల్లలు అక్కడ పానీపూరి తిన్నారు. తిన్న కాసేపటికే వాంతులు, విరోచనాలతో, కడుపు నొప్పితో బాధపడుతూ పిల్లలు అస్వస్థత కు గురి కావటంతో వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక ఇటువంటి అనేక ఘటనలు వర్షాకాలంలో ప్రధానంగా చోటు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వర్షాకాలం పానీపూరీలు తినటం మంచిది కాదంటున్న వైద్యులు

వర్షాకాలం పానీపూరీలు తినటం మంచిది కాదంటున్న వైద్యులు

పానీపూరీ తయారీలో కలుషితమైన నీటిని ఉపయోగించడం వల్లనే పానీ పూరి తిన్నవారు డయేరియా బారిన పడినట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్యం బారిన పడిన వందమందికి వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. వారికి ప్రాణాపాయం లేకుండా చికిత్స చేస్తున్నారు. అందుకే వర్షాకాలం బయట పానీపూరీలు తినడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఇంతా చెప్తున్నా వినకుండా తినాలనుకుంటే మీ ఇష్టం అని చెప్తున్నారు.

English summary
More than 100 people have contracted diarrhea after eating panipuri in Dogachia area of Sugandha village panchayat of Hooghly district in West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X