వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

87 మిలియన్ ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీక్: కేంబ్రిడ్జి ఎనలిటికా మాజీ ఉద్యోగి ప్రకటన

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఫేస్‌బుక్ యూజర్లలో సుమారు 8.7 కోట్ల మంది డేటా చోరికి గురైందని కేంబ్రిడ్జి ఎనలిటికా మాజీ ఉద్యోగి ప్రకటించారు. మంగళవారం నాడు బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ ముందు హజరైన బ్రిటనీ కైసర్‌పై సభ్యులు ప్రశ్నలు సంధించారు.

పలు యాప్‌లు, సర్వేల ద్వారా కేంబ్రిడ్జి ఎనలిటికా ఎఫ్‌బీ యూజర్ల డేటాను చోరీ చేసేదని యూజర్ల నుండి డేటాను రాబట్టేందుకు సైకాలజీ, డేటా సైన్స్ బృందాలు సర్వేలో ప్రశ్నావళిని రూపొందిస్తాయని ఆమె పార్లమెంటరీ కమిటీకి చెప్పారు.

More than 87 million Facebook users data stolen, claims ex-Cambridge Analytica employee

ప్రపంచవ్యాప్తంగా యూజర్ల డేటాను ఫేస్‌బుక్ విక్రయిస్తోందనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఫేస్‌బుక్ సీఈఓ జుకర్ బర్గ్ అమెరికన్ పార్లమెంటరీ కమిటీ ముందుకు హజరయ్యారు. కమిటీ సభ్యులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

అయితే ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీకైందనే విషయాన్ని జుకర్ బర్గ్ ఒప్పుకొన్నారు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు జరగకుండా చూస్తామని ఆయన హమీ ఇచ్చారు. అంతేకాదు క్షమాపణలు కోరుతూ పత్రికా ప్రకటనలు కూడ గుప్పించారు.

దీంతో ఫేస్‌బుక్‌ యూజర్ల పెద్ద ఎత్తున తమ అకౌంట్లను డిలీల్ చేస్తున్నారు. ఫేస్‌బుక్ అకౌంట్లు డిలీట్ చేయాలనే ఉద్యమం కూడ సాగింది. ఈ తరుణంలోనే కేంబ్రిడ్జి ఎనలిటికా మాజీ ఉద్యోగి బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ ముందు వెల్లడించిన అంశాలు సంచలనం కల్గిస్తున్నాయి.

English summary
A former Cambridge Analytica employee has claimed that the number of Facebook users whose data must have been compromised by her firm may go beyond 87 million, in a testimony before a parliamentary committee in the United Kingdom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X