• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో 900 కోట్లకు పైగా నగదు .. అదృష్ట లక్ష్మి తలుపు తట్టిందని సంబరం .. అంతలోనే

|

బీహార్ రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థులు నక్క తోక తొక్కారని అనుకున్నారు. వారిని అదృష్ట లక్ష్మి వరించిందని అందరూ అనుకున్నారు . రూపాయి కాదు రెండు రూపాయలు కాదు వందల కోట్ల నగదు ఒక్కసారి వచ్చి పడటం అంటే మాటలా అని గుసగుసలాడుకున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా డ్యామిడ్ కథ అడ్డం తిరిగింది. అదృష్ట లక్ష్మి తలుపు తట్టినట్టే తట్టి ఇట్టే మాయమైంది.

బీహార్ రాష్ట్రంలో ఇద్దరు స్కూల్ విద్యార్థులు ఖాతాల్లో వందల కోట్ల నగదు
ఇక అసలు విషయానికి వస్తే బీహార్ రాష్ట్రంలో ఇద్దరు విద్యార్ధుల బ్యాంకు ఖాతాల్లోకి కోట్ల రూపాయల నగదు డిపాజిట్ కావడం సంచలనం సృష్టించింది. ఉత్తర బీహార్ లోని గ్రామీణ బ్యాంకులో ఇద్దరు విద్యార్ధులకు ఖాతాలు ఉన్నాయి. యూనిఫామ్ కొనడానికి, సంబంధిత ఖర్చులను చెల్లించడానికి, ప్రభుత్వ పథకం కింద కొంత డబ్బు వారి ఖాతాలో జమ కావలసి ఉంది. ఈ మేరకు ఆ డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి వారు స్థానికంగా ఉన్న ఏటీఎంలు, బ్యాంకులకు వెళ్లారు. అయితే వారి ఖాతాలో ఉన్న నగదును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంత డబ్బు తమదేనా అంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అదే సమయంలో అనేక అనుమానాలు, భయాలు కూడా వారికి కలిగాయి.

 More than 900 crore money credited in the accounts of two students created sensation

రాత్రి సమయంలో అకస్మాత్తుగా ఖాతాలలో వచ్చి పడిన నగదు
తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా నగదు బీహార్లోని కటిహార్‌లోని గ్రామంలో ఇద్దరు విద్యార్థుల ఖాతాలలో జమ అయినట్లుగా గుర్తించిన అధికారులు సైతం అవాక్కయ్యారు. మొన్నటికి మొన్న బీహార్ లోని ఒక వ్యక్తి అకౌంట్లోకి ఐదున్నర లక్షలు జమ కాగా, తాజాగా మరోమారు ఊహించని విధంగా బోలెడంత నగదు జమ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ విద్యార్థులు అకస్మాత్తుగా రాత్రి సమయంలో వారి ఖాతాలలో కోట్లాది రూపాయలు జమ అయ్యాయని గుర్తించారు.

ఒక విద్యార్ధి ఖాతాలో 6.2 కోట్లు, మరో విద్యార్థికి ఏకంగా 900 కోట్లు .. కానీ వారికి నిరాశే

6 వ తరగతి విద్యార్థి ఆశిష్ ఖాతాలో 6.2 కోట్లకు పైగా నగదు జమ కాగా , మరో పాఠశాల విద్యార్థి, గురు చరణ్ విశ్వాస్, తన ఖాతాలో 900 కోట్లకు పైగా నగదు జమ అయిందని వెల్లడించారు. ఇక ఈ నగదు కోసం బ్యాంకులకు వెళ్లినవారికి చుక్కెదురైంది. ఖాతాలలో వందల కోట్ల రూపాయలు ఉన్నట్లు చూపిస్తున్నా ఒక్క రూపాయి కూడా తీసుకోలేని పరిస్థితి ఆ విద్యార్థుల కుటుంబాలను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇక ఈ విషయాన్ని గ్రామాధికారి కూడా ధృవీకరించారు. 900 కోట్లకు పైగా నగదు జమ కావడం తో స్థానిక లావాదేవీలు, బ్యాంక్ లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్తున్నారు.

విచారణ జరుపుతున్న అధికారులు .. బ్యాంకు నుండి నివేదిక కోరామని వెల్లడి
ఈ ఘటనపై ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థుల బ్యాంక్ ఎకౌంట్ లో భారీ మొత్తాన్ని కనుగొన్నట్టు గుర్తించామని, ఏదో సాంకేతిక లోపంతో ఆ విధంగా కనిపించి ఉండొచ్చని వెల్లడించారు. వారి స్టేట్ మెంట్ లో మొత్తం కనిపిస్తుంది కానీ, అసలు నగదు వారి ఖాతాలో లేదని అధికారులు చెబుతున్నారు. దీనిపై తాము బ్యాంకు నుండి నివేదికను కోరామని కటిహార్ జిల్లా మేజిస్ట్రేట్ ఉదయన్ మిశ్రా చెప్పారు.

ఇటీవలి కాలంలో బీహార్‌లో స్టేట్‌మెంట్‌లో ప్రతిబింబించేలా బ్యాంకు ఖాతాదారుడికి భారీ తప్పుడు మొత్తం పంపించడం ఇది రెండవ సారి.

ఇటీవల పాట్నాలోనూ అకౌంట్ లోకి నగదు .. ఆసక్తికర ఘటన
ఇటీవల పాట్నా శివార్లలోని ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఖాతాలో ఐదున్నర లక్షల నగదు పొరపాటున జమ కాగా, గుర్తించిన బ్యాంకు అధికారులు వేరే ఖాతాకు బదిలీ కావాల్సిన నగదు పొరబాటున ఆ వ్యక్తి ఖాతాకు బదిలీ అయ్యాయని, ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగాడు. ఇకఅతను చెప్పిన సమాధానం షాక్ కు గురి చేసింది. తనకు ప్రధాని నరేంద్ర మోడీ ఆ డబ్బులు ఇచ్చాడని తాను తిరిగి ఇచ్చేది లేదని సదరు వ్యక్తి డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

English summary
In the state of Bihar, crores of rupees were deposited in the bank accounts of two students. While 6th class student's accounts were credited with over Rs 6.2 crore, another student, found that more than Rs 900 crore had been credited in his account. Authorities are investigating the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X