'పిఓకేలో వెయ్యి మందికిపైగా మిలిటెంట్లకు శిక్షణ'
శ్రీనగర్: భారత్‌పై దాడులను తీవ్రం చేయడానికి వందల సంఖ్యలో మిలిటెంట్లకు పాకిస్థాన్ శిక్షణ ఇస్తోందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ, పాక్‌లోనూ 17కు పైగా ఈ రకమైన ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తోందని తెలిపాయి.
ఈ శిబిరాల్లో 1000 నుంచి 1150 మంది మిలిటెంట్లు శిక్షణ పొందుతున్నారని భారత సైనిక కమాండర్ ఒకరు మంగళవారం ఇక్కడ వెల్లడించారు.
వీరిలో 325 మంది మిలిటెంట్లు భారత్‌లోకి చొరబడేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని ఇంటిలిజెన్స్ కథనాలను ఉటంకిస్తూ లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా వెల్లడించారు.

ఆధీనరేఖకు సమీపంలో 23కు పైగా స్థావరాలను ఏర్పరచుకుని భారత్‌లోకి చొరబడేందుకు 325 మంది మిలిటెంట్లు కాచుకుకూర్చున్నారని ఆయన చెప్పారు.
సరిహద్దు ప్రాంతాల్లో భారత్ నిఘా పెరగడం వల్ల చొరబాట్లకు అవకాశం లేకుండాపోయిందని అందుకేవారి సంఖ్య పెరుగుతోందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications