వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓడలో నరక యాతన- 2 వేల మంది ప్రయాణికుల మధ్య 66 కోవిడ్ రోగులు- అటూ ఇటూ తిరుగుతూ

|
Google Oneindia TeluguNews

ముంబై-గోవా సముద్ర తీరంలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గోవా నుంచి ముంబై వెళ్తున్న కార్డిలియా క్రూయిజ్ నౌకలో 66 మంది కోవిడ్ రోగులు ఉన్నారన్న సమాచారంతో మిగతా ప్రయాణికులందరికీ చుక్కలు కనిపిస్తున్నాయి. వీరిని అందులో నుంచి బయటకు పంపాలంటూ మిగతా ప్రయాణికులు ఆందోళనకు దిగారు. కానీ నౌక సముద్రం మధ్యలో ఉండటంతో ఈ రోగుల్ని అక్కడి నుంచి బయటకు పంపలేని పరిస్ధితి.

క్రూయిజ్ నౌకలో కోవిడ్ రోగులు

క్రూయిజ్ నౌకలో కోవిడ్ రోగులు

గోవా నుంచి ముంబైకు నిన్న ఓ క్రూయిజ్ నౌక బయలుదేరింది. దాని పేరు కార్డిలియా. గోవా తీరంలో ఎప్పటిలాగే అది ప్రయాణికుల్ని ఎక్కించుకుని బయలుదేరింది. మొత్తం 2 వేల మంది ప్రయాణికులు ఇందులో ఎక్కారు. అయితే అంతకముందే నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో అందులో ప్రయాణిస్తున్న 66 మందికి కోవిడ్ ఉన్నట్లు తేలింది. నౌక గోవా తీరం నుంచి బయలుదేరిన తర్వాత ఈ విషయం తెలిసింది. దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. తమ చుట్టూ కోవిడ్ రోగులు ఉన్నారని తెలిసి మిగతా వారికి కంటిమీద నిద్ర కరువైంది.

కోవిడ్ రోగుల సంచారం

కోవిడ్ రోగుల సంచారం


కార్డిలియా క్రూయిజ్ నౌకలో ప్రయాణిస్తున్న వారిలో 66 మందికి కరోనా సోకినట్లు గుర్తించిన మిగతా ప్రయాణికులకు కంటిమీద కునుకు లేదు. దీనికి తోడు సదరు కోవిడ్ రోగులు నౌక లాబీల్లో సంచరిస్తుండటంతో ఇక మిగతా వారి భయాలకు అంతులేకుండా పోతోంది. లాబీల్లో వీరు తిరుగుతుండటం వల్ల తమ కుటుంబసభ్యులకు, పిల్లలకు ఎక్కడ కరోనా సోకుతుందో అని మిగతా ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. తక్షణం వీరినైనా బయటికి పంపాలని, లేదా తమనైనా బయటికి తీసుకురావాలని వారు కోరుతున్నారు.

బయటికెళ్లేందుకు నో ఛాన్స్

బయటికెళ్లేందుకు నో ఛాన్స్

కార్డిలియా క్రూయిజ్ నౌకలో 66 మంది కోవిడ్ రోగులు ఉన్నట్లు తేలినా అధికారులు జోక్యం చేసుకుని వారిని బయటకు పంపేందుకు ప్రయత్నించకపోవడంపై మిగతా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని బయటకు పంపకపోతే కనీసం తమనైనా నౌక నుంచి బయటకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే సముద్రంలో ప్రయాణం సాగిస్తుండటంతో వీరిని నౌక నుంచి బయటకు పంపేందుకు అవకాశం లేకుండాపోతోంది. దీంతో వీరి ఆందోళన మరింత పెరుగుతోంది.

విమర్శల వెల్లువ

విమర్శల వెల్లువ


గోవా అధికారులు నౌక బయలుదేరే ముందు కోవిడ్ పరీక్షలు నిర్వహించి పాజిటివ్ గా తేలిన వారిని క్రూయిజ్ లోకి అనుమతించకుండా ఉండాల్సిందన్న వాదన వినిపిస్తోంది. వీరిని నెగెటి్వ్ గా తేలిన వారితో కలిపి ఎలా పంపుతారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇది గోవా అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నౌకలో ఉన్న తమ కుటుంబాలు, పిల్లలకు వైరస్ సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు నిలదీస్తున్నారు. దీంతో అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఏమీ చేయలేని పరిస్ధితి.

English summary
passengers travelling in mumbai-goa cruise ship cordelia have worried with having 66 covid 19 patients roaming around them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X