కేంద్ర ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్ -ఐసోలేషన్‌లో అశ్వినీ కుమార్ చౌబే
కొత్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ దేశంలో కరోనా విలయం ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు వైరస్ కాటుకు గురికాగా, అందులో ఓ కేంద్ర మంత్రి, ముగ్గురు ఎంపీలు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. తాజాగా సాక్ష్యాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే కూడా మహమ్మారి బారినపడ్డారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. స్పల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నానని, దాంట్లో తనకు వైరస్ సోకినట్లు తేలిందని మంత్రి స్వయంగా సోమవారం ప్రకటించారు.

డాక్టర్ల సలహాలు, కొవిడ్ ప్రొటోకాల్స్ ప్రకారం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి చౌబే తెలిపారు. ఇటీవల కాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారంతా వెంటనే కొవిడ్ టెస్టులు చేయించుకుని ఐసోలేషన్ లో ఉండాల్సిందిగా ఆయన సూచించారు. కాగా,
కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం ముమ్మరం చేసిన సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి వైరస్ బారినపడటం గమనార్హం. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం నిన్న ఒక్కరోజే దేశంలో కొత్తగా 20,021 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,07,871కి చేరింది. ఇందులో 97,82,669 మంది ఇప్పటికే కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఆదివారం నాటి 279 మరణాలతో కలిపి మహమ్మారికి బలైపోయినవారి సంఖ్య 1,47,901కి పెరిగింది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications