Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాహుబలి, ఆ సినిమాల ఎఫెక్ట్: ముఖ్యమంత్రికి ఆశ్చర్యపోయే చిక్కు

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కొత్త చిక్కు వచ్చి పడింది! ఆయన ఇంటికి పలు సినిమాల నిర్మాతలు క్యూ కడుతున్నారు. తమ సినిమాలు చూడమని విజ్ఞప్తి చేస్తున్నారు.

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కొత్త చిక్కు వచ్చి పడింది! ఆయన ఇంటికి పలు సినిమాల నిర్మాతలు క్యూ కడుతున్నారు. తమ సినిమాలు చూడమని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆయన ఇటీవల బాహుబలి-2, నిరుత్తర చిత్రాలను ఒకేరోజు చూసిన విషయం తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన రాజకుమార చిత్రాన్ని ఆయన ఈ మధ్య చూశారు.

ఫోటో పెట్టడంతో..

ఫోటో పెట్టడంతో..

ఈ సినిమాకు ఆయన హాజరైన ఓ ఫొటోని, సీఎంఓ కార్యాలయ సిబ్బంది సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఆయన ఈ ఫొటో పెట్టడమే ఆయనకు పెద్ద తలనొప్పిగా తయారైంది.

క్యూ కడుతున్న నిర్మాతలు

క్యూ కడుతున్న నిర్మాతలు

ఎందుకంటే, ఆయా చిత్రాల నిర్మాతలు తమ సినిమా చూడాలంటే, తమ సినిమా చూడాలని సిద్ధరామయ్యను ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయానికి, నివాసానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు.

రాజకీయాల్లో తీరిక ఉండటం లేదని

రాజకీయాల్లో తీరిక ఉండటం లేదని

దీనిపై సిద్ధరామయ్య స్పందించారు. కాలేజీ రోజుల్లో తాను తరచుగా సినిమాలు చూస్తుండే వాడినని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకు తీరిక ఉండటం లేదని చెప్పారు.

నిర్మాతలకు ధన్యవాదాలు

నిర్మాతలకు ధన్యవాదాలు

పనుల నిమిత్తం బిజీగా ఉన్న తాను, ఎప్పుడుపడితే అప్పుడు సినిమాలు చూడటం కుదరదని, తమ సినిమాలు చూడాలని తనను ఆహ్వానిస్తున్న నిర్మాతలకు ధన్యావాదాలు చెప్పి పంపిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+