జయలలితకు కంగ్రాట్స్: ఐఏఎస్ అధికారికి నోటీసులు
భోపాల్: వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన తమిళనాడు సీఎం జయలలితకు కంగ్రాట్స్ చెప్పినందుకు ఓ ఐఏఎస్ అధికారి నోటీసులు అందుకున్నారు. నోటీసులకు వెంటనే వివరణ ఇవ్వాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ కలెక్టర్ గా శిబి చక్రవర్తి పని చేస్తున్నారు. జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తరువాత శిబి చక్రవకర్తి జయలలితకు శుభాకాంక్షలు చెప్పాలని భావించారు.

మే 19వ తేదిన శిబి చక్రవర్తి తన ఫేస్ బుక్ లో కామెంట్స్ చేశారు. అందులో కంగ్రాట్స్ అమ్మ అంటూ పోస్టు పెట్టారు. ఈ విషయం మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. అంతే శిబి చక్రవర్తి మీద కన్నెర్ర చేసింది.
సివిల్ సర్వీసు నియమాలు ఉల్లంఘించారని శిబి చక్రవర్తికి నోటీసులు ఇచ్చారు. తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో శిబి చక్రవర్తి ఫేస్ బుక్ నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించారు. ఈ విషయంపై స్పందించడానికి శిబి చక్రవర్తి నిరాకరిస్తున్నారు.
బర్వానీ కలెక్టర్ అజయ్ గంగ్వార్ ఇటీవల జవహర్ లాల్ నెహ్రూను ప్రశంసించి, నరేంద్ర మోడీని విమర్శించినందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆయనను బదిలి చేసింది. ఫేస్ బుక్ లో కామెంట్స్ పై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications