చైనాకు మిస్టర్ 56 భయపడుతున్నారన్న రాహుల్ గాంధీ; మోడీ ఛాతీ సైజు చెప్పి జాతీయ భద్రతపై ఆగ్రహం

చైనాను ఎదుర్కొనే విషయంలో భారత ప్రభుత్వానికి సరైన వ్యూహం లేదని, దేశ జాతీయ భద్రత విషయంలో భారతదేశం క్షమించరాని విధంగా రాజీ పడుతోందని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. చైనా సరిహద్దు సమస్యపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్న వార్తా నివేదికను ఆయన ఉదహరించారు. ఒకరికొకరు విరుద్ధమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని రాహుల్ గాంధీ తప్పుబట్టారు.

 చైనా గ్రామాల వివాదంపై మోడీ సర్కార్ ను టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ

చైనా గ్రామాల వివాదంపై మోడీ సర్కార్ ను టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ

వాస్తవాధీన రేఖ వెంట చైనా ఆక్రమణలపై అమెరికా రక్షణ శాఖ నివేదికపై మీడియాలో వచ్చిన కథనాలను రాహుల్ గాంధీ ఉటంకించారు. జాతీయ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక వ్యూహం లేకపోవడం వల్ల ఇలాంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పరస్పర భిన్నమైన ప్రకటనలు వెల్లడించడంపై మండిపడిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చైనాకు మిస్టర్ 56 భయపడుతున్నారు అంటూ ప్రధాని మోడీని పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

చైనాకు మిస్టర్ 56 భయపడుతున్నారన్న రాహుల్ గాంధీ

చైనాకు మిస్టర్ 56 భయపడుతున్నారన్న రాహుల్ గాంధీ


56 అంగుళాల ఛాతి ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వానికి చైనా ను ఎదుర్కోవడానికి ఒక వ్యూహం లేదని పేర్కొన్న రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం అవాస్తవాలు చెబుతున్న నేపథ్యంలో ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దులకు కాపలా కాస్తున్న సైనికులకు సంఘీభావం తెలుపుతున్నాను అని ట్విట్టర్లో పేర్కొన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు, అభివృద్ధి పరంగా ఉత్తరప్రదేశ్‌ను గుజరాత్‌గా మార్చడానికి 56 అంగుళాల ఛాతీ అవసరమని మోదీ అన్నారు. ఇక ఆ వ్యాఖ్యలనే టార్గెట్ చేస్తూ 56 అంగుళాల ఛాతి చైనాకు భయపడుతోంది అంటూ అంటూ ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించారు రాహుల్ గాంధీ.

భారత్ లో చైనా గ్రామాలపై బిపిన్ రావత్ చెప్పిందిదే

భారత్ లో చైనా గ్రామాలపై బిపిన్ రావత్ చెప్పిందిదే

భారత భూభాగంలోకి చైనా అక్రమంగా ప్రవేశించి కొత్త గ్రామాన్ని నిర్మిస్తుందని అమెరికా రక్షణ శాఖ నివేదికలోని అంశాలపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ , అలాగే విదేశాంగ శాఖ భిన్నమైన వాదనలు వినిపించారు . చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ చైనీయులు భారత భూభాగంలోకి వచ్చి కొత్త గ్రామాన్ని నిర్మిస్తున్నారన్నది వివాదమే కాదని, చైనా నిర్మించిన గ్రామాలు వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా వైపు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ నివేదికలో వాస్తవాలు లేవని ఖండించారు. లైన్ ఆఫ్ యాచ్యువాల్ కంట్రోల్ భారతీయ "అవగాహన" ను చైనా అతిక్రమించలేదని కూడా బిపిన్ రావత్ నొక్కి చెప్పారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పిందిదే

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పిందిదే

తన ఇటీవలి నివేదికలో, యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఎల్‌ఎసి తూర్పు సెక్టార్‌లో టిబెట్ అటానమస్ రీజియన్ మరియు భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ మధ్య వివాదాస్పద భూభాగంలో చైనా ఒక పెద్ద గ్రామాన్ని నిర్మించిందని పేర్కొంది. యుఎస్ నివేదికపై అధికారిక ప్రతిస్పందనలో, విదేశాంగ మంత్రిత్వ శాఖ క్రమంగా ఆక్రమించడానికి, చైనా అన్యాయమైన వాదనలను భారత్ అంగీకరించలేదని ఖండించింది. దశాబ్దాలుగా చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాలతో సహా సరిహద్దు ప్రాంతాల్లో చైనా గత కొన్నేళ్లుగా నిర్మాణ కార్యకలాపాలను చేపట్టిందని చైనాను దౌత్యపరమైన మార్గాల ద్వారా ఎదుర్కొంటున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు .

 చైనా గ్రామాల వివాదం.. రాజ్ నాథ్ ను టార్గెట్ చేసిన చిదంబరం

చైనా గ్రామాల వివాదం.. రాజ్ నాథ్ ను టార్గెట్ చేసిన చిదంబరం

అంతకు ముందు చైనా గ్రామాల నిర్మాణంపై ప్రభుత్వంపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన మంత్రిత్వ శాఖలో ఒక గీతను గీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మరియు సిడిఎస్‌ను "ఎల్‌ఎసిలో తన వైపు జాగ్రత్తగా ఉండాలని కోరారు. తమ వైపు భద్రంగా ఉండేలా చూసుకోవాలని ఎద్దేవా చేశారు. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.

 అరుణాచల్ ప్రదేశ్ లో చైనా గ్రామం నిర్మాణం ... జాతీయ భద్రతపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

అరుణాచల్ ప్రదేశ్ లో చైనా గ్రామం నిర్మాణం ... జాతీయ భద్రతపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

ఇక అసలు వివాదం ఏమిటంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఒకే ఒక ఏడాదిలో చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందని సుమారు వంద ఇళ్లు విశాలమైన రోడ్లు శాటిలైట్ ఇమేజింగ్ స్పష్టంగా కనిపిస్తున్నాయని భారత భూభాగంలో 4.5 కిలోమీటర్ల దూరం మేర ఈ విలేజ్ నిర్మాణం జరిగిందని 2019 ఆగస్టులో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకపోయినప్పటికీ సంవత్సరం నవంబర్ నాటికి ఈ గ్రామం ప్రత్యక్షమైంది అని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. ఇక ఈ నివేదిక నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంలో మోడీని టార్గెట్ చేస్తుంది. చైనాకు భారత్ భయపడుతుందని ఆరోపిస్తుంది.

 13వ రౌండ్ సైనిక చర్చలలోనూ పురోగతి లేదు .. కొనసాగుతున్న ప్రతిష్టంభన

13వ రౌండ్ సైనిక చర్చలలోనూ పురోగతి లేదు .. కొనసాగుతున్న ప్రతిష్టంభన

గత నెలలో, రెండు దేశాల మధ్య 13వ రౌండ్ సైనిక చర్చల సందర్భంగా తూర్పు లడఖ్‌లోని మిగిలిన ఘర్షణ పాయింట్లలో 18 నెలల ప్రతిష్టంభనను పరిష్కరించడంలో భారతదేశం మరియు చైనా ఎటువంటి పురోగతి సాధించలేకపోయాయి. తూర్పు లడఖ్‌లోని సున్నితమైన సెక్టార్‌లో ఇటు భారత్, అటు చైనా రెండు వైపుల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి ప్రస్తుతం ప్రతి వైపు 50,000 నుండి 60,000 మంది సైనికులు ఉన్నారు. చైనాతో భారత్ వివాదం తెగకుండా రోజుకో రకంగా కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+