Omicron:ఇంటర్నేషనల్ ప్లైట్స్ నిలిపివేయండి.. ప్రధాని మోడీకి కేజ్రీవాల్ రిక్వెస్ట్

ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో కేసులు రాగా.. 14 దేశాలకు వ్యాపించాయి. ఇదీ డెల్టా కన్నా వేగంగా వ్యాపించి.. తీవ్రత ఎక్కువగా ఉండటంతో భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో కొన్ని దేశాలు రాకపోకలపై నిషేధం కూడా విధించాయి. భారత్ కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఫస్ట్ వేవ్ వచ్చిన సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆలస్యం చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఈ మేరకు ప్రధాని మోడీకి హిందీలో కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. చాలా దేశాలు విమాన సేవలను నిలిపివేశాయని.. మీరు కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రయాణానికి సంబంధించి ఇజ్రాయెల్, జపాన్ కఠినతర నిబంధనలను అమలు చేస్తుందని తెలిపారు. ఫస్ట్ వేవ్ సమయంలో విమాన రాకపోకలను నిలిపివేయలేమని.. దీంతో చాలా ఫ్లైట్స్ ఢిల్లీ వచ్చాయని చెప్పారు. అదీ అలా వ్యాపించి.. ఇతర నగరాలకు పాకిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా విమాన రాకపోకలను నిలిపివేయాలని కేజ్రీవాల్ కోరారు.

Kejriwal

కొత్త వేరియంట్ వైరస్ నేపథ్యంలో కేజ్రీవాల్ రివ్యూ నిర్వహించారు. పరిస్థితి గురించి సమీక్షించారు. విమానాల రాకపోకలను నిలిపివేయాలని కేజ్రీవాల్ కోరడం ఇదే తొలిసారి కాదు.. ఇదివరకు కూడా రిక్వెస్ట్ చేశారు. గత వారం కూడా ఇదే డిమాండ్‌తో లెటర్ కూడా రాశారు. మీరు చేసే ఆలస్యం ప్రమాదాన్ని కొని తెస్తుందని వివరించారు. ఇటు 12 దేశాల నుంచి విమాన రాకపోకలపై నిషేధం విధించాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఆయన సూచించారు.

ఒమిక్రాన్ వేరియంట్ వివిధ మ్యూటెంట్లను పరివర్తనం చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదివరకు ఇలాంటి కాంబినేషన్ చూడలేమని వారు వివరించారు. ప్రొటీన్‌కు సంబంధించి 30 మ్యూటెషన్స్ ఉన్నాయి. కొత్త వేరియంట్‌ను బీటాతో పోల్చలేమని వివరించారు. ఇమ్యూనిటీ ఉన్నవారు.. వ్యాక్సిన్ తీసుకున్న వారు వైరస్ బరి నుంచి తప్పించుకోవచ్చు అని తెలిపారు. దీనికి సంబంధించి రెండు విధాలుగా స్టడీ చేశామన్నారు. ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్ కొత్త వేరియంట్‌ను ఎదుర్కొగలవా అని ప్రశ్నిస్తే.. కచ్చితంగా తెలియదు అని సైంటిస్ట్ తెలిపారు. కానీ పౌష్టికాహారం తీసుకొని.. జాగ్రత్తగా ఉండాలని సజెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+