Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎమ్ ఎస్ స్వామినాథ‌న్‌ను దేశ అత్యున్నత‌ పౌరపురస్కారంతో గౌర‌వించాలి..

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు మరణానంతర భారతరత్న అవార్డుతో ఆయన‌ను గౌరవించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇప్పటికే ఆయనకు దేశ అత్యున్నత‌ పౌరపురస్కారం భారతరత్న అవార్డు ఇవ్వడంలో ఆలస్యం చేశారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఆయనకు భారతరత్న ఇవ్వడం ద్వారా శాస్త్రవేత్తలను, ఈ దేశ రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని గౌరవించినట్లు అవుతుందని తెలిపారు. ఎంఎస్ స్వామినాథన్‌కు ఇప్పటికైనా భారతరత్న అవార్డును ఇవ్వాలని తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రాన్ని కోరారు.

ఆయ‌న లాంటివారు యుగానికొక్క‌రూ..
డాక్టర్ స్వామినాథన్ గురించి మంత్రి నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయ‌న లాంటి వారు యుగానికొక్కరు పుడతార‌ని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యవసాయ శాస్త్రవేత్త మరణం బాధాకరమన్నారు. పరిశోధకుడిగా తిండిగింజలను అందించి ఆకలిని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్న శాస్త్రీయ యోధుడంటూ పేర్కొన్నారు. ఈ వందేళ్లకాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అతి కొద్దిమందిలోని అద్భుతమయిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అంటూ ప్ర‌స్తావించారు. ఆయన సారధ్యంలో ఏర్పడిన కమీషన్ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని సూచించిందని గుర్తుచేశారు. కమీషన్ వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, అమలు చేస్తానన్న బీజేపీ ప్రభుత్వం అమలు చేయకుండా రైతాంగానికి అన్యాయం చేసాయని ఆరోపించారు.

MS Swaminathan

హ‌రిత విప్ల‌వంలో కీల‌క పాత్ర‌..
ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు M.S.స్వామినాథన్‌ (98) గురువారం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. అధిక దిగుబడి ఇచ్చే వరి, గోధుమ వంగడాలు సృష్టించి భారతదేశంలోని రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఎంఎస్ స్వామినాథన్ గణనీయమైన కృషి చేశారు. భారత హరిత విప్లవంలో కీలక పాత్ర పోషించారు. డాక్టరు కావాలనుకున్న స్వామినాథన్‌, 1943లో వచ్చిన బెంగాల్‌ దుర్భిక్షం చూసి చలించిపోయి వైద్య విద్యకు స్వస్తిచెప్పి వ్యవసాయ శాస్త్రవేత్తగా మారారు.

చెన్నైలో అంత్య‌క్రియలు..
ఎంఎస్ స్వామినాథన్ భౌతికకాయానికి చెన్నైలో శనివారం మధ్యాహ్నం తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బెజంట్ నగర్ ఎలక్ట్రిక్ స్మశానవాటికలో స్వామినాథన్ కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. చెన్నైలోని తరమణిలో డాక్టర్ స్వామినాథన్ భౌతిక ఖాయానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం బెజంట్ నగర్‌లో నిర్వహించిన ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

వివిధ అవార్డులు ఆయ‌న సొంతం..
1961లో వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు అందుకున్నారు. 1969లో భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. 1971లో ప్రతిష్ఠాత్మక రామన్ మెగసేసే అవార్డు అందుకున్నారు. 1987లో వల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ అందుకున్న తొలి శాస్త్రవేత్త స్వామినాథనే అని గుర్తుచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+