• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముఖేష్ అంబానీ కేసులో షాకింగ్ ట్విస్ట్ .. ఇంటి దగ్గర సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేసిన పోలీస్ అధికారి సచిన్ వాజే

|

పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటికి సమీపంలో స్కార్పియో వాహనంలో జెలటిన్ స్టిక్స్ పెట్టి , ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపు లేఖ రాసిన కేసు దర్యాప్తు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. అంబానీ బెదిరింపుల కేసులో అనుమానితుడిగా అరెస్ట్ అయిన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ను కోర్టు ఈ నెల మార్చి 25 వరకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో కొత్త మలుపు

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో కొత్త మలుపు

ఈ కేసులో మొదటి స్కార్పియో వాహనం యజమాన గా భావించిన మన్సుఖ్ హిరెన్ ను ప్రశ్నించిన పోలీసులు ఆవాహనం దొంగలించబడిందని వెల్లడించారు. ఆ తర్వాత ఈ కేసులో కీలక సాక్ష్యంగా భావిస్తున్న హిరెన్ హత్యకు గురికావడంతో కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక హిరెన్ భార్య ఆ స్కార్పియో వాహనాన్ని ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే నాలుగు నెలల పాటు వాడుకున్నాడని చెప్పడంతో కేసులో కొత్త కోణాలు వెలుగుచూశాయి.

సీసీ టీవీ ఫుటేజ్ తొలగింపు .. స్కార్పియో వాహనాన్ని ఉపయోగించిన సచిన్ వాజే ?

సీసీ టీవీ ఫుటేజ్ తొలగింపు .. స్కార్పియో వాహనాన్ని ఉపయోగించిన సచిన్ వాజే ?

మొదట ముఖేష్ అంబానీ కి బాంబు బెదిరింపు కేసులో మొదటి దర్యాప్తు అధికారి గా వ్యవహరించింది , ఆ వాహనాన్ని వినియోగించారని చెప్పబడుతున్న పోలీస్ అధికారి సచిన్ వాజే కావడంతో వెంటనే అతనిని బదిలీ చేసింది ప్రభుత్వం. తాజాగా సస్పెన్షన్ వేటు వేసింది. అతనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ఎన్ఐఏ అధికారులు.
అయితే సచిన్ వాజే ఆ స్కార్పియో ఉపయోగించారా లేదా అనేది తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిసి టివి ఫుటేజ్ లభించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తుంది.

సిఐయూ అధికారిగా ఉన్నప్పుడే సచిన్ వాజే సీసీ టీవీ ఫుటేజ్ స్వాధీనం

సిఐయూ అధికారిగా ఉన్నప్పుడే సచిన్ వాజే సీసీ టీవీ ఫుటేజ్ స్వాధీనం


ఈ కేసు విషయంలో తన ప్రమేయాన్ని దర్యాప్తు చేస్తున్న క్రమంలో సచిన్ వాజే నివాసముంటున్న హౌసింగ్ సొసైటీ యొక్క డిజిటల్ వీడియో రికార్డర్ ను ఇంటిలిజెన్స్ ఏజెన్సీలో నాడు అధికారిగా ఉన్న సచిన్ వాజే స్వాధీనం చేసుకున్నారు. ఇక అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఐ ఏ డిజిటల్ వీడియో రికార్డ్ నుండి వచ్చిన సిసి టివి ఫుటేజ్ లో ఏమీ లేకపోవడంతో ఈ కేసులో మరింత ఆసక్తి చోటుచేసుకుంది .
మొదట ఆరోపణలు ఎదుర్కొన్న సచిన్ వాజే ను సిఐయు నుండి ముంబై పోలీసు ప్రధాన కార్యాలయంలోని సిటిజెన్ ఫెసిలిటేషన్ సెంటర్‌కు బదిలీ చేశారు.

ఆధారాలు దొరక్కుండా ఇదంతా చేశారా ? సిఐయూ అధికారులను విచారిస్తున్న ఎన్ఐఏ

ఆధారాలు దొరక్కుండా ఇదంతా చేశారా ? సిఐయూ అధికారులను విచారిస్తున్న ఎన్ఐఏ

ఆ తర్వాత కొద్ది రోజులకు సచిన్ వాజే‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. నిన్న ఆయనను సర్వీసు నుంచి సస్పెండ్ చేశారు.
సచిన్ వాజే తన సొంత రెసిడెన్షియల్ సొసైటీ యొక్క డివిఆర్ మరియు సిసిటివి ఫుటేజ్లను ఎందుకు స్వాధీనం చేసుకున్నారన్న దానిపై ఎన్ఐఏ ఇప్పుడు ఆసక్తిగా ఉంది. దర్యాప్తులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మన్సుఖ్ హిరేన్‌తో తన సంబంధాలు బహిర్గతం అయిన తర్వాత అతనిపై ఏవైనా ఆధారాలు దొరకకుండా ఉండడం కోసం సచిన్ వాజే ఈ పని చేసి ఉండవచ్చని ఎన్ఐఏ అనుమానిస్తుంది. సిసి టివి ఫుటేజ్ తొలగింపుకు సంబంధించి సిఐయు అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ రియాజ్ కాజీని కూడా ఏజెన్సీ ప్రశ్నిస్తోంది.

English summary
ATS officials investigating Mukesh Ambani's bomb threat case ,Suspended Mumbai policeman Sachin Vaze, arrested for his suspected role in the placement of an explosives-laden car outside industrialist Mukesh Ambani's residence, is found to have seized his own housing society's digital video recorder (DVR) while he was probing the case under the Crime Intelligence Unit (CIU). The National Investigation Agency (NIA), which later arrested him, is probing if the CCTV footage from the DVR had been tampered with. It is also looking into the possibility of Mr Vaze having brought the SUV to his own residential compound.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X