వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖేష్ అంబానీకి బెదిరింపు కేసులో అంతా మిస్టరీనే .. సచిన్ వాజే, హిరెన్ మధ్య మంతనాల సీసీటీవీ ఫుటేజ్

|
Google Oneindia TeluguNews

ముఖేష్ అంబానీ కి బాంబు బెదిరింపు కేసు రోజుకో కొత్త మలుపులు తిరుగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగి విచారిస్తున్న ఈ కేసులో తాజాగా ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్న సస్పెండ్ అయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజేకు చెందిన మరో రెండు లగ్జరీ కార్లను అధికారులు సీజ్ చేశారు. ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో స్కార్పియో వాహనాన్ని నిలిపి, బెదిరింపులకు దిగిన కేసులో సచిన్ వాజే కీలక నిందితుడు.

సచిన్ వాజేకు చెందిన రెండు కార్లు సీజ్ చేసిన అధికారులు

సచిన్ వాజేకు చెందిన రెండు కార్లు సీజ్ చేసిన అధికారులు

అధికారులు సీజ్ చేసిన రెండు కార్లలో ఒక కారు రత్నగిరికి చెందిన శివసేన నాయకుడు విజయ్ కుమార్ గణపట్ భోస్లే పేరుతో రిజిస్టర్ అయి ఉంది. మరో కారు మెర్సిడెస్ బెంజ్ కారు.
ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో స్కార్పియో వాహన యజమానిగా పోలీసులు విచారించిన మన్సుఖ్ హిరెన్ హత్యకు గురికావడంతో, స్కార్పియో వాహనాన్ని ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే వినియోగించారని అతని భార్య ఆరోపించడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సచిన్ వాజే ను అరెస్ట్ చేసిన పోలీసులు, ముకేశ్ అంబానీ ఇంటి ముందు కారు నిలిపి బాంబు బెదిరింపు కేసులో కూడా సచిన్ వాజే ది కీలక పాత్ర అని నిర్ధారించారు.

 ఫిబ్రవరి 17న హిరెన్ ను సచిన్ వాజే కలిసినట్టు సీసీ టీవీ ఫుటేజ్

ఫిబ్రవరి 17న హిరెన్ ను సచిన్ వాజే కలిసినట్టు సీసీ టీవీ ఫుటేజ్

మూడు రోజుల క్రితం సచిన్ వాజేకు చెందిన మెర్సిడెస్ బెంజ్ కారు సీజ్ చేసిన అధికారులు ఈ కేసు దర్యాప్తు కావలసిన కీలక ఆధారాలను సేకరించారు. ముఖేష్ అంబానీ ఇంటి వద్ద నిలిపిన స్కార్పియో వాహన నంబర్ ప్లేట్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఎన్ఐఏ అధికారులు ఫిబ్రవరి 17న హిరెన్ ను సచిన్ వాజే కలిసినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించారు. పోర్టు వద్ద జీపీఓ సమీపంలో వారిద్దరూ కలిసినట్టు దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడుకున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయింది.

జిపివో వద్ద వాహనంలో 10 నిముషాల పాటు మంతనాలు

జిపివో వద్ద వాహనంలో 10 నిముషాల పాటు మంతనాలు

ఇక సచిన్ వాజే కదలికలను గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించిన అధికారులు ముంబై పోలీసు ప్రధాన కార్యాలయం నుండి సచిన్ వాజే మన్సుఖ్ హిరెన్ ను కలవడానికి వెళ్ళినట్లుగా గుర్తించారు. ఫిబ్రవరి 17వ తేదీన తన వాహనంలో ముంబై పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి సీఎస్ఎంటీ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆపిన సచిన్ వాజే కారులో మన్సుఖ్ హిరెన్ ఎక్కారు . జిపివో వద్ద ఆ వాహనాన్ని పార్క్ చేసి పది నిమిషాలపాటు మాట్లాడుకున్న తరువాత హిరెన్ కారు దిగి వెళ్ళిపోయాడు .

సచిన్ వాజే తో సంబంధాన్ని పోలీసులకు చెప్పని హిరెన్ .. హిరెన్ హత్య తర్వాత ఎన్ఐఏ విచారణ

సచిన్ వాజే తో సంబంధాన్ని పోలీసులకు చెప్పని హిరెన్ .. హిరెన్ హత్య తర్వాత ఎన్ఐఏ విచారణ


ఇదే సమయంలో ములంద్ ఐరోలి రహదారిపై తన వాహనం పాడైందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా హిరెన్ పోలీసులకు తెలిపారు. కానీ సచిన్ వాజే విషయాన్ని మన్సుఖ్ హిరెన్ ఎక్కడా ప్రస్తావించలేదు.

అంతకుముందు కూడా సచిన్ వాజే మన్సుఖ్ హిరెన్ ను తనను కలవడానికి రావాలని చెప్పగా ఓలా క్యాబ్ ఎక్కి హిరెన్ సచిన్ వాజేను కలవడానికి వెళ్లారు. ఈ లోపు ఐదుసార్లు వాజే హిరెన్ కు కాల్ చేశారని ఓలా క్యాబ్ డ్రైవర్ చెప్పారు .

క్యాబ్ డ్రైవర్ ను విచారిస్తున్న అధికారులు , మరికొందరి సాక్ష్యాల సేకరణ

క్యాబ్ డ్రైవర్ ను విచారిస్తున్న అధికారులు , మరికొందరి సాక్ష్యాల సేకరణ


తొలుత పోలీసు ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న రూపమ్ షోరూమ్ కలవాలని చెప్పారని, ఆ తర్వాత ప్లేస్ మార్చి సీఎస్ఎంటీ దగ్గర కలుద్దామని చెప్పినట్టు తెలుస్తోంది. సచిన్ వాజేకు , హిరెన్ కు మధ్య సంబంధాలు ఉండడం, ఈ కేసులో కీలక సాక్షి అయిన హిరెన్ హత్యకు గురికావడంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ మరింత లోతుగా విచారణ కొనసాగిస్తుంది. సచిన్ వాజే సాక్ష్యాలను లేకుండా చెయ్యటానికి చేసిన ప్రయత్నాలు , గతంలో అతనిపై ఉన్న నేర చరిత్ర నేపధ్యంలో ఈ కేసులో సచిన్ వాజే మెడకు ఉచ్చు బిగుస్తోంది.

English summary
NIA officials are gathering key evidence in the Mukesh Ambani bomb threat case. Authorities have confirmed that Sachin Waje played a key role in the case and are inquiring over his relationships. Based on CCTV footage, the Anti-Terrorism Squad and NIA officials investigating the case have confirmed that Sachin Waje met Hiren on February 17. CCTV footage showed the two meeting near the GPO at the port and talking for about ten minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X