అంబానీపై బాంబు దాడి కుట్ర: తీహార్ జైల్లో బయటపడ్డ లింకులు.. ఆ టెర్రరిస్ట్ నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం...

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో ఇటీవల పేలుడు పదార్థాలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు తాజాగా తీహార్ జైలుతో లింకులు బయటపడ్డాయి. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఒకరి నుంచి పోలీసులు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్‌ఫోన్ నుంచే 'జైషుల్‌ హింద్' అనే టెలీగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసినట్లు గుర్తించారు. అంబానీ ఇంటిపై బాంబు దాడికి ప్లాన్ చేసింది తామేనని జైషుల్ హింద్ ప్రకటించిన నేపథ్యంలో... తీహార్ జైల్లో దాని మూలాలు బయటపడటం కలకలం రేపుతోంది.

తీహార్ జైల్లో తనిఖీలు...

తీహార్ జైల్లో తనిఖీలు...

అంబానీ ఇంటి వద్ద పేలుడు కుట్రను పోలీసులు భగ్నం చేశాక... ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని జైషుల్ హింద్ టెలీగ్రామ్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు,అంబానీ దంపతుల నుంచి ఆ సంస్థ క్రిప్టోకరెన్సీ కూడా డిమాండ్ చేసింది. దీంతో టెలీగ్రామ్‌లో జైషుల్ హింద్ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసిన ఫోన్ నంబర్‌పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ నంబర్‌‌ను తీహార్ జైలుకు సమీపంలో ట్రాక్ చేసినట్లు సైబర్ నిపుణులు చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టారు.

తెహసీన్ అక్తర్ నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం...

తెహసీన్ అక్తర్ నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం...

గురువారం(మార్చి 11) తీహార్ జైల్లోని జైల్ నంబర్ 8లో ఉన్న ఖైదీల వస్తువులను పోలీసులు సోదా చేశారు. ఈ సందర్భంగా తెహసీన్ అక్తర్ అనే ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది నుంచి ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే సెల్‌ఫోన్ నుంచి ఓ యాప్ ద్వారా వర్చువల్ నంబర్స్‌ను క్రియేట్ చేసి... వాటి ద్వారా టెలీగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసినట్లు గుర్తించారు. ఫిబ్రవరి 26న టెలీగ్రామ్ ఖాతాను క్రియేట్ చేశారని,ఆ మరుసటిరోజే అంబానీ ఇంటి సమీపంలో పేలుడుకు బాధ్యత వహిస్తూ జైషుల్ హింద్ అదే టెలీగ్రామ్ ఖాతాలో ప్రకటన ఇచ్చినట్లు తేల్చారు.

అతనే కీలకం...?

అతనే కీలకం...?

తెహసీన్ అక్తర్ వద్ద గుర్తించిన ఆ సిమ్‌ కార్డు తూర్పు ఢిల్లీలోని రఘుబర్ పురాకు చెందిన జయదీప్ లోధియా అనే వ్యక్తి పేరిట ఉన్నట్లు తేలింది. అయితే అది తెహసీన్ అక్తర్ వద్దకు ఎలా చేరిందన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద తీహార్ జైలు నుంచే అతను సెల్‌ఫోన్‌‌ను ఆపరేట్ చేశాడని... అంబానీ ఇంటి వద్ద పేలుడుకు సంబంధించిన ప్లాన్‌లో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.అదే బారక్‌లో మరికొంతమంది అల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలతో లింకులున్న ఖైదీలు కూడా ఉన్నట్లు సమాచారం. సోదాల సందర్భంగా మొత్తం 11 మంది ఖైదీలను పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. మున్ముందు దర్యాప్తులో మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

కొనసాగుతున్న ఎన్ఐఏ దర్యాప్తు

కొనసాగుతున్న ఎన్ఐఏ దర్యాప్తు

ఇటీవల ముంబైలోని ముకేశ్ అంబానీ ఇల్లు అంటిల్లాకు సమీపంలో ఓ స్కార్పియో కారులో 20 జిలిటెన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. పేలుడు ప‌దార్థాల‌తో పాటు అందులో కొన్ని కార్ల నంబ‌ర్ ప్లేట్లు కూడా ఉన్నాయి. వాటిలో అంబానీ భ‌ద్ర‌తా సిబ్బంది వినియోగించే కార్ల‌కు సంబంధించిన నంబ‌ర్ ప్లేట్లు ఉండ‌టం గ‌మ‌నార్హం. పోలీసులు పేలుడు కుట్రను భగ్నం చేయగా... జైషుల్ హింద్ అనే సంస్థ టెలీగ్రామ్ ద్వారా దీనిపై ప్రకటన చేసింది. దాడికి ప్లాన్ చేసింది తామేనని... ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+