Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ - ఎస్పీ అధినేత హెల్త్ పై బులిటెన్..

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధినేత ములాయం సింగ్ యాదవ్‌ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయనను గుర్ గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించినట్లు పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. నేత ఆరోగ్యంపై కార్యకర్తలు ప్రజల్లో ఆందోళన నెలకొనడంతో ఆస్పత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశాయి.

80 ఏళ్ల ములాయం కొంతకాలంగా మల బద్ధకం, కడుపు నొప్పితో బాధపడుతున్నారని, నొప్పి తీవ్రతరం కావడంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని మేదాంత ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కపూర్ మీడియాకు చెప్పారు. ''ములాయం సింగ్ యాదవ్‌కు కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆయన సరిగ్గా ఆహారం తినలేకపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది''అని డాక్టర్ కపూర్ తెలిపారు.

Mulayam Singh Yadav admitted to hospital in Lucknow

ములాయం ప్రస్తుతం చికిత్స పొందుతోన్న మేదాంత ఆస్పత్రికి ఆయన కొడుకు, ఎస్పీ జాతీయ చీఫ్, మాజీ యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ వచ్చారు. అఖిలేశ్ వెంట భార్య డింపుల్ యాదవ్ కూడా ఉన్నారు. నేతాజీ ఆరోగ్యంపై కంగారు పడొద్దని అఖిలేశ్ ఎస్పీ కార్యాకర్తలకు చెప్పినట్లు సమాచారం. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ములాయం తరచూ ఆస్పత్రికి వెళ్లొస్తున్నారు. చివరిసారిగా మే నెలలో కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరి, రెండ్రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.

Mulayam Singh Yadav admitted to hospital in Lucknow
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+