పావురాలను కొంటున్న రెస్టారెంట్: చికెన్ వంటకంగా వినియోగదారులకు!
ముంబై: మహారాష్ట్ర ముంబైలోని మతుంగ ఈస్ట్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పావురాలను పెంచుకుంటూ అవి పెద్దవైన తర్వాత వాటిని ఓ రెస్టారెంట్‌కు విక్రయిస్తున్నాడు. అయితే, ఆ రెస్టారెంట్ యాజమాన్యం పావురాలను చంపి, వాటి మాంసాన్ని చికెన్ అని చెబుతూ వినియోగదారులకు సర్వ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ ఆర్మీ మాజీ అధికారి సదరు వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అభిషేక్ సావంత్ అనే వ్యక్తితోపాటు స్థానిక హౌజింగ్ కమిటీ సొసైటీకి చెందిన మరో ఏడుగురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అభిషేక్ తను ఉండే అపార్ట్‌మెంట్‌పై పావురాలను పెంచుతున్నాడు. ఆ తర్వాత వాటిని సమీపంలోని ఓ రెస్టారెంట్‌లో విక్రయిస్తున్నాడు. ఇక ఆ హోటల్ సిబ్బంది.. ఈ పావురాలను చంపి వాటి మాంసంతో వంటకాలు చేస్తూ.. చికెట్ అని చెప్పి వినియోగదారులకు అందిస్తున్నారు.
ఇది గమనించిన ఆర్మీ మాజీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆర్మీ అధికారి ఆరోపణల్లో వాస్తవం లేదని నిందితుడు అభిషేక్, స్థానిక హౌజింగ్ కమిటీ సభ్యుడు, ఆ ఆపార్ట్‌మెంట్ యజమాని చెబుతున్నారు.
గతంలో కూడా ఆయన ఇలాగే తప్పుడు ఆరోపణలు చేసి ఫిర్యాదులు చేస్తున్నారని అంటున్నారు. అయితే, తాను చేసిన ఫిర్యాదుపై వీడియో ఆధారాలను కూడా పోలీసులకు అందించానని సదరు ఆర్మీ మాజీ అధికారి వెల్లడించారు.












Click it and Unblock the Notifications