దారుణం: రెండేళ్ళుగా కూతుళ్ళపై అత్యాచారం, భార్య ఏం చేసిందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: కన్న కూతుళ్ళపై ఓ తండ్రి రెండేళ్ళుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు అయితే ఈ విషయం తెలిసి భార్య నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో నిందితుడు భార్య, పిల్లను ఇంటి నుండి బయటకు గెంటేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ముంబైలోని వకోల ప్రాంతానికి చెందిన 42 ఏళ్ళ వ్యక్తి ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు కూతుళ్ళు, ఓ కొడుకు ఉన్నాడు. 17 ఏళ్ళ తన పెద్ద కూతురిపై గత రెండేళ్ళుగా పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఏడాది నవంబర్‌లో రెండో కూతురిపై కూడ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.

Mumbai fashion designer held for ‘raping’ two minor daughters for 2 years

అయితే ఈ విషయాన్ని పెద్ద కూతురు తల్లికి చెప్పింది. ఇంత కాలంగా పెద్ద కూతురును నిందితుడు భయబ్రాంతులకు గురిచేశాడు. రెండో కూతురిపై కూడ అత్యాచారయత్నానికి ప్రయత్నించడంతో పెద్ద కూతురు అసలు విషయాన్ని తల్లికి చెప్పింది.

దీంతో ఆమె భర్తతో గొడవకు దిగింది. తనను ప్రశ్నించిందనే కోపంతో భార్య, పిల్లలను ఆ నిందితుడు ఇంటి నుండి బయటకు గెంటేశాడు. దీంతో నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 42-year-old father of four was arrested on Monday morning for allegedly repeatedly sexually assaulting his two older daughters aged 17 and 13 for two years.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి