ముంబై: 13 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం: చిక్కుకున్న పలువురు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని ఓ భవనంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలువురు భవనంలో చిక్కుకున్నట్లు సమాచారం. విలేపార్లే ప్రాంతంలో ఆదివారం రాత్రి 7.10గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

13 అంతస్తుల ఈ భవనంలోని 7,8 అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను పూర్తిగా ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా, ఈ భవనంలో పలువురు చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications