Viral video: కానిస్టేబుల్ కిల్లింగ్ మూవ్‌మెంట్స్: కమల్ హాసన్ పాటకు పర్‌ఫెక్ట్ స్టెప్స్
ముుంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను నివారించడానికి అమలు చేసిన లాక్‌డౌన్ తరహా పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం చేసిన సేవలను మాటల్లో వర్ణించలేనిది. కరోనా మహమ్మారి భయం వల్ల ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితుల్లో.. పోలీసులు మాత్రం 24 గంటల పాటు రోడ్ల మీదే ఉంటూ రోజులు తరబడి విధుల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొందరు పోలీసులు తమలో ఉన్న కళాకారుడిని నిద్ర లేపారు.
తమ టాలెంట్‌ను ప్రదర్శించారు. ఆ తరువాత కూడా దాన్ని కొనసాగిస్తూ వస్తోన్నారు. తాజాగా ముంబైకి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ చేసిన కొన్ని డాన్స్ మూవ్‌మెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోన్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. డాన్స్ మూవ్‌మెంట్స్ అదర గొట్టారాయన. అచ్చు దించేశాడంతే. బహుభాషా నటుడు కమల్ హాసన్ నటించిన అప్పురాజా సినిమాలోని ఆయా హై రాజా అనే పాటకు కళ్లు చెదిరేలా స్టెప్స్ వేశారు.

కమల్ హాసన్ డ్యూయెల్ రోల్‌లో నటించిన తమిళం సినిమా అపూర్వ సహోదరంగళ్ మూవీ.. హిందీ డబ్బింగ్ వెర్షన్ అప్పురాజా. భారీ కాయుడే అయినప్పటికీ.. స్టెప్స్‌పై దాని ప్రభావం పడలేదు. ఇదే సినిమా తెలుగులో విచిత్ర సోదరులు పేరుతో విడుదలైంది. ఇందులో కమల్ హాసన్ పొట్టివాడిగా నటించారు. హిందీ వెర్షన్‌లోని ఆయా హై రాజా అనే పాటకు ఆ కానిస్టేబుల్ స్టెప్స్ వేశారు. ఆయన పేరు అమోల్ యశ్వంత్ కాంబ్లే. నయీగావ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులను నిర్వర్తిస్తుంటారు.
డాన్సర్ కావాలనేది ఆయన చిరకాల కోరిక. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పోలీసు శాఖలో చేరాల్సి వచ్చింది. ఆ తరువాత కూడా డాన్స్‌పై తనకు ఉన్న ఇంట్రెస్ట్‌ను ఏ మాత్రం వదులుకోలేకపోయాడు. 80, 90వ దశకాల నాటి సూపర్ హిట్ పాటలకు అదరగొట్టే స్టెప్స్ వేస్తుంటారు. దీనికోసం ప్రత్యేకంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఓపెన్ చేశారు. అందులో ఉన్న వీడియో క్లిప్పింగులన్నీ డాన్స్ మూవ్‌మెంట్స్‌కు సంబంధించినవే. అప్పురాజా పాటకు ఆయన వేసిన స్టెప్స్‌ను 22,600 మందికి పైగా లైక్ చేశారు.
నయీగావ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయనకు డాన్సింగ్ కానిస్టేబుల్‌గా పిలుస్తుంటారు. పోలీస్ అధికారులు ఏర్పాటు చేసే కొన్ని ఫంక్షన్లకు కూడా అమోల్ కాంబ్లే స్పెషల్ అట్రాక్షన్‌గా మారుతుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లో ఖాళీ రోడ్లపై డాన్స్ చేస్తూ ఇదివరకు నాలుగైదు వీడియోలను కూడా ఆయన చిత్రీకరించారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు ఫిల్మ్ ఇండస్ట్రీ బిగ్ షాట్స్ కూడా ఆయన వీడియోను లైక్ చేసిన వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications