వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీని కించపరిచిన ఏఐబీ కామిడి గ్రూప్, కేసు, ఎఫ్ఐఆర్, ఏం చేస్తారో చేసుకోండి !

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రధాని నరేంద్ర మోడిని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన కామిడీ గ్రూప్ ఏఐబీ మీద ముంబై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు. మోడీ లాగే కనిపించే వ్యక్తి ఫోటో, దాని పక్కనే మోడీని కించపరుస్తూ మార్ఫింగ్ చేసిన ఫోటో పోస్టు చేశారు.

నరేంద్ర మోడీని పోలిన వ్యక్తి ఒక బ్యాగ్ తగిలించుకుని రైల్వే ఫ్లాట్ మీద నిలబడి మొబైల్ లో చూస్తూ రైలు కోసం వేచి ఉన్నట్లుగా కామిడి గ్రూప్ ఏఐబీ తన అధికారిక గ్రూప్ లో పోస్టు చేసింది. ఈ విషయం గుర్తించిన ఓ మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Mumbai police file fir against AIBs Tanmay Bhat meme on PM Modi

భారత ప్రధాని మోడీని కించపరిచారని, భారతీయుల మనోభావాలు దెబ్బ తీశారని, అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఏఐబీ గ్రూప్ కు చెందిన ముఖ్యస్తుడు తన్మయ్ భట్ సోషల్ మీడియాలో మరో పోస్టు చేశారు.

మేము మాకు ఇష్టం వచ్చినట్లు పోస్టు చేస్తాం, అవసరం అయితే డిలీట్ చేస్తాం, లేదంటే మళ్లీ పోస్టు చేస్తాం, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అనే రీతిలో పోస్టు చేశాడు. గతంలో ఇదే గ్రూప్ నిర్వహకులు క్రికెట్ ఆటగాడు సచిన్, లతామంగేష్కర్ తదితరులను కించపరుస్తూ అవహేలనగా పోస్టు చేసిన విషయం తెలిసిందే.

English summary
The Cyber Cell of the Mumbai Police registered an FIR against All India Bakchod's Tanmay Bhat. The member of the comedy collective was booked for tweeting a meme of Prime Minister Narendra Modi with a Snapchat 'dog' filter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X