ఆంక్ష‌ల వలయంలో ముంబయి.. సాయంత్రం 5 తర్వాత పబ్లిక్‌ ప్లేస్‌ల‌లో నో ఎంట్రీ

మహారాష్ట్రలో ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ ఉద్ధృతి పెరిగింది. మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరిన్ని ఆంక్ష‌లను అమలులోకి తీసుకువచ్చింది. ముంబాయిలోని పార్క్‌లు, మైదానాలు, బీచ్‌లు వంటి పబ్లిక్ ప్లేస్‌ల‌కు సాయంత్రం 5 గంటల తర్వాత వెళ్లేందుకు నిషేధించింది. ఈ ఆంక్ష‌లు జనవరి 15 వరకు అమల్లో ఉంటాయని ఆదేశాలు జారీ చేసింది.

ముంబాయిలో 144 సెక్ష‌న్

ముంబాయిలో 144 సెక్ష‌న్

కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కువగా ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ అప్రమ్తమైంది. కరోనాను కట్టిడి చేసేందుకు న్యూఇయర్ వేడుకలపై కూడా ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించింది. జనవరి 7 వరకు ముంబాయితో పాటు పలు ప్రాంతాల్లో 144 సెక్ష‌న్ అమ‌లులో ఉంటుంద‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. ప్రజల ఆరోగ్యం, భద్రతను ప్ర‌ధానంగా దృష్టిలో ఉంచుకుని నిషేధాజ్ఞాలు జారీ చేస్తున్నట్లు ముంబాయి పోలీసులు వెల్లడించారు. .

సాయంత్రం 5 గంట‌ల త‌ర్వాత బ‌హిరంగ ప్ర‌దేశాల‌కు నో ఎంట్రీ..

సాయంత్రం 5 గంట‌ల త‌ర్వాత బ‌హిరంగ ప్ర‌దేశాల‌కు నో ఎంట్రీ..


మహామ్మారి వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడంపై నిషేధం విధించారు.. ఈ నిషేదం విధించిన సమయాల్లో బీచ్‌లు, పార్కులు, వాకింగ్ ప్రాంతాలు, మైదానాల వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. న్యూఇయర్ వేడుకల వేళ పబ్బులు, హోటల్స్, బహిరంగ ప్రదేశాల్లో కూడా పార్టీలపై నిసేధం విధించారు పోలీసు అధికారులు.

ముంచుకొస్తున్న ముప్పు..

ముంచుకొస్తున్న ముప్పు..

మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 5,368 కరోనా కేసులు నమోదయ్యాయి. . 22 మంది మృతి చెందారు. పెరుగుతున్న కరోనా కేసుల్లో అత్యధికం ముంబాయిలోనే వస్తున్నాయి. నిన్న ఒక్క రోజు 3,671 కరోనా కొత్త కేసులు వచ్చాయి. రాష్ట్రం మొత్తం మీద గురువారం 198 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా వాటిలో 190 మంది ముంబాయిలో నివసిస్తున్నవారే. దేశంలో న‌మోదైన మొత్తం కేసుల్లో స‌గం ఒమిక్రాన్ కేసులు మ‌హారాష్ట్రలోనే నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 450కి చేరింది.. వాటిలో ముంబాయిలోనే 327 మంది వైరస్ సోకిన వారు ఉన్నారు.. తాజాగా దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం కూడా మహారాష్ట్రలోనే నమోదైంది. పూణేలోని పింప్రీ చించువాడ చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఒమిక్రాన్ బాధితుడు గుండెపోటుతో మృతిచెందాడు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+