Mumbai serial blast: కిరాతకుడు, 29 ఏళ్లకు అరబ్ లో చిక్కిన దావూద్ శిష్యుడు అబూ బకర్!
ముంబాయి/ హైదరాబాద్: ఒకటి కాదు, పది కాదు, 20 కాదు, ఏకంగా 29 ఏళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం శిష్యుడు, 1993 ముంబాయి వరుస బాంబు పేలుళ్లలో ప్రధాన నిందితుడు అయిన అబూ బకర్ ఎట్టకేలకు భారత్ భద్రతా దళాలకు చిక్కిపోయాడు. ఇంతకాలం పాకిస్తాన్, అరబ్ దేశాల్లో తలదాచుకున్న అబూ బకర్ ను పక్కా సమాచారంతో భారతదేశం భద్రతా సంస్థలు అతన్ని పట్టుకున్నాయి.
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ముద్రపడిన దావూద్ ఇబ్రహీం శిష్యుడు అబూ బకర్ ను అరెస్టు చేసి భారతదేశానికి తీసుకురావడానికి ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అయితే ఇంతకాలం భారతదేశానికి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో పాటు అతని ప్రధాన అనుచరుడు టైగర్ మెమన్ మాత్రం ఇంకా చిక్కడం లేదు.

1993 ముంబాయి వరుస బాంబు పేలుళ్లు
1993లో ముంబాయి (అప్పటి బాంబే) నగరంలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. 1993 మార్చి 12వ తేదిన బాంబేలో వరుస బాంబు పేలుళ్లు జరగడంతో 257 మంది అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ వరుస బాంబు పేలుళ్లలో 1,400 మందికి పైగా తీవ్రగాయాలైనాయి. అనేక మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు వారి కసి తీర్చుకున్నారు.

నరరూప రాక్షుడి శిష్యుడు
1993లో బాంబేలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం అని ప్రపంచం మొత్తం తెలుసు. స్మగర్ల నుంచి ఉగ్రవాదిగా మారిపోయిన దావూద్ ఇబ్రహీం అతని అనుచరులు టైగర్ మెమన్, యాకుబ్ మెమన్, అబూ బకర్ తదితరులు అప్పటి బాంబే ,ఇప్పటి ముంబాయిలో వరుస బాంబు పేలుళ్లు జరిపారని వెలుగు చూసింది.

దర్జాగా చక్కేసిన అబూ బకర్
బాంబే వరుస బాంబు పేలుళ్ల తరువాత అబూ బకర్ భారతదేశం వదిలేసి దర్జాగా విదేశాలకు పారిపోయాడు. ఇంతకాలం పాకిస్తాన్, అరబ్ దేశాల్లో తలదాచుకున్న అబూ బకర్ కోసం భారత భద్రతా సంస్థలు గాలిస్తూనే ఉన్నాయి. 2019లో అబూ బకర్ భారత భద్రతా దళాలకు చిక్కినా డాక్యుమెంటేషన్ సమస్యల కారణంగా అతను అప్పట్లో తప్పించుకున్నాడు.

పక్కాసమాచారంతో అరెస్టు
29 ఏళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం శిష్యుడు, 1993 ముంబాయి వరుస బాంబు పేలుళ్లలో ప్రధాన నిందితుడు అయిన అబూ బకర్ ఎట్టకేలకు భారత్ భద్రతా దళాలకు చిక్కిపోయాడు. ఇంతకాలం పాకిస్తాన్, అరబ్ దేశాల్లో తలదాచుకున్న అబూ బకర్ ను పక్కా సమాచారంతో భారతదేశం భద్రతా సంస్థలు అతన్ని యూఏఇలో పట్టుకున్నాయి.

భారత్ కు తీసుకోస్తే?
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ముద్రపడిన దావూద్ ఇబ్రహీం శిష్యుడు అబూ బకర్ ను యూఏఇలో అరెస్టు చేసి భారతదేశానికి తీసుకురావడానికి ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇంతకాలం భారత భద్రతా సంస్థలకు చిక్కకుండా విదేశాల్లో తలదాచుకుని ఎంజాయ్ చేస్తున్న అబూ బకర్ చిక్కడంతో ముంబాయి బాంబు పేలుళ్ల బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

టైగర్ మెమన్ మాత్రం అడ్రస్ లేడు
1993 ముంబాయి బాంబు పేలుళ్ల కేసు ప్రధాన నిందితుడు, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో తలదాచుకున్నాడని భారతదేశం వాదిస్తున్నా అందుకు పాకిస్తాన్ కుంటిసాకులు చెబుతూ మాదేశంలో దావుద్ ఇబ్రహీం లేడని చెబుతోంది. దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు టైగర్ మెమన్ మాత్రం భారతదేశ భద్రతా దళాలకు చిక్కకుండా ఇప్పటి వరకు తప్పించుకుని తిరుగుతున్నాడు. టైగర్ మెమన్ (61) ఎక్కడ ఉన్నాడు అనే విషయం పక్కాగా తెలీయడం లేదు.

టైగర్ యాకూబ్ చిక్కినా వీళ్లు మాత్రం చిక్కలేదు
1993 ముంబాయి వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుల్లో ఒక్కడైన టైగర్ యాకూబ్ మాత్రం భారత్ కు చిక్కిపోయాడు. 1993 ముంబాయి వరుస బాంబు పేలుళ్లు జరపడానికి ఆర్థిక సహాయం చేశారని, వాహనాలు కొనగోలు చెయ్యడానికి సహకరించాడని వెలుగు చూడటంతో టైగర్ యాకుబ్ కు 2013 మార్చి 21వ తేదీన సుప్రీం కోర్టు మరణ శిక్ష విదించింది.
2015 జులై 30వ తేదీన మహారాష్ట్ర ప్రభుత్వం నాగపూర్ సెంట్రల్ జైల్లో టైగర్ యాకుబ్ కు ఉరి శిక్ష విధించింది. ఇదే కేసులో 10 మంది నిందితులకు మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. మొత్తం మీద అబూ బకర్ ను త్వరలో భారతదేశానికి తీసుకురావడానికి అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications