వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో ప్రధాని నరేంద్ర మోడీపై మర్డర్ కేసు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీని అరెస్ట్ చేయాలంటూ ఇంగ్లాండ్‌లో కేసు నమోదైంది. తారిఖ్ మహ్మద్ అనే ముస్లిం సామాజికవేత్త ఇంగ్లండ్‌లోని డెఫ్రాడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

2002లో గుజరాత్‌లో అల్లర్లు జరిగిన సమయంలో ముగ్గరు బ్రిటీష్ పౌరులు మరణించడానికి అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీయే కారణమని ఆరోపిస్తూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ ఘటనపై భారత ప్రధాని మోడీని పూర్తి బాధ్యుణ్ణి చేస్తూ వెంటనే అరెస్ట్ చేయాలంటూ కేసు పెట్టాడు. నవంబర్‌లో యుకె పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీని అరెస్ట్ చేయాలని మహ్మద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Murder Case Lodged Against PM Narendra Modi in UK

ఫిబ్రవరి 27, 2002. గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌వూపెస్ ఎస్-6లో చెలరేగిన మంటల్లో 59 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో అధికులు అయోధ్య నుంచి వస్తున్న కరసేవకులు. ఈ ఘటన అనంతరం గుజరాత్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి.

గుజరాత్‌లో 25 జిల్లాలు ఉండగా.. 16 జిల్లాలు అల్లర్లతో అతలాకుతలమయ్యాయి. దాడులు, ప్రతిదాడులు, మారణాయుధాలతో వీధుల్లో స్వైరవిహారాలు, దహనాలు, లూఠీలు, హత్యలు, మానభంగాలు, సజీవ దహనాలతో 150 పట్టణాలు, వేలాది గ్రామాలు అల్లకల్లోలమయ్యాయి.

ఈ అల్లర్లలో మొత్తం 1200కు పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వేల కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలైంది.

English summary
Tariq Mahmood, a Muslim Community activist in the UK, has a lodged a complaint against the Indian Prime Minister Narendra Modi demanding his arrest for the 2002 Gujarat riots in which three British citizens were also killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X