అక్కను గర్బవతిని చేశాడని తల, మర్మాంగం, మొండెం పూర్తిగా నరికేశారు: హంతకులను !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు నగరంలో ఇటీవల జరిగిన ఓ దారుణ హత్య కేసులో పోలీసు జాగిలాలు చాకచక్యంగా పసిగట్టి హంతకుడిని పోలీసులకు పట్టించాయి. తల, మర్మాంగంలేని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇప్పుడు హంతకులు గాంధీజీరాయ్, మధుజీ రాయ్ అనే ఇద్దరు సోదరులను అరెస్టు చేశారు.

గాంధీ, మధు బావ కాశీరామ్ ను అరెస్టు చెయ్యడానికి బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఒడిశాకు బయలుదేరారు. ఈనెల 11వ తేదీ ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నైస్ రోడ్డు సమీపంలో తల, మర్మాంగంలేని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రక్తపు మరకలు

రక్తపు మరకలు

పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినా హంతకుడి వివరాలు సేకరించలేకపోయారు. 800 మీటర్ల దూరంలో హత్య చేసి మృతదేహాన్ని లాక్కొని వచ్చి ముళ్లపోదలలో వెయ్యడంతో ఆ పరిసర ప్రాంతాలు అంతా రక్తం మరకలు అయ్యాయి.

జిమ్మీ ఎంటర్

జిమ్మీ ఎంటర్

పోలీసులు శిక్షణ ఇచ్చిన శునకం జిమ్మీని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి ఆధారాలు సేకరించడానికి ప్రయత్నించారు. 800 మీటర్ల దూరంలో హత్యకు గురైన వ్యక్తి మొబైల్ ను పోలీసు శునకం జిమ్మీ గుర్తించింది. ఆ మొబైల్ నెంబర్ ఆధారంగా హత్యకు గురైయ్యింది ఒడిశాకు చెందిన చిరాంచీమాంజీ అనే గుర్తించారు.

ఇంటి యజమాని

ఇంటి యజమాని

చిరాంచీమాంజీ అద్దెకు ఉంటున్న దొడ్డతోగూరులోని గోవిందప్ప ఇంటికి వెళ్లి విచారణ చెయ్యగా హత్యకు గురైన వ్యక్తితో పాటు మధు, గాంధీ ఇక్కడే కలిసి నివాసం ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. పోలీసులు గాంధీ, మధును అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

అక్కా, చెల్లి ఇక్కడే

అక్కా, చెల్లి ఇక్కడే

మధు, గాంధీల ఇద్దరు అక్కలు బెంగళూరు చేరుకుని దొడ్డతేగూరు ప్రాంతంలో నివాసం ఉంటూ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. గాంధీ, మధుల పెద్ద అక్కకు ఒడిశాకు చెందిన కాశీరామ్ తో వివాహం అయ్యిందని, మరో అక్కకు పెళ్లికాలేదని పోలీసులు చెప్పారు.

మొగుడు లేకుంగా గర్బవతి

మొగుడు లేకుంగా గర్బవతి

కాశీరామ్ భార్య ఇటీవల ఒడిశాకు వెళ్లింది. అనారోగ్యంతో ఉన్న ఆమెను స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించడంతో ఆమె గర్బవతి అని వెలుగు చూసింది. భర్తకు 9 నెలలుగా దూరంగా ఉంటున్నా ఆమె ఎలా గర్బవతి అయ్యింది అని కుటుంబ సభ్యులు ఆరా తీశారు.

బార్ లో మద్యం సేవించారు

బార్ లో మద్యం సేవించారు


బెంగళూరులోని చిరాంచీమాంజీ కారణంగా తాను గర్బవతి అయ్యానని ఆమె అసలు విషయం చెప్పింది. కాశీరామ్ ఒడిశా నుంచి బెంగళూరు వచ్చాడు. కాశీరామ్, మధు, గాంధీ కలిసి ఈనెల 10వ తేదీ రాత్రి చిరాంచిమాంజీని మద్యం సేవించడానికి బయటకు తీసుకెళ్లారు.

గర్బవతిని చేస్తావా

గర్బవతిని చేస్తావా

అదే రోజు రాత్రి బార్ లో మద్యం సేవించిన తరువాత మళ్లీ మద్యం తీసుకుని నైస్ రోడ్డు సమీపంలోని మైదానంలోకి వెళ్లారు. అక్కడ చిరాంచీరాంజీకి పీకలదాక మద్యం తాగించి ఇనుపరాడ్ తో తలపగలగొట్టారు. ఈ మర్మాంగంతో మా అక్కను గర్బవతిని చేస్తావా అంటూ పదునైన కోడవలితో తల నరికి మర్మాంగం కోసి తీసుకెళ్లి వేరే ప్రాంతంలో విసిరేశారని పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Murder Case Police Dog help to investigation in Bengaluru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి