హిందూ భక్తి గీతం పాడిన ముస్లిం గాయనికి జడ్జిల ప్రశంసలు, సనాతనవాదుల విమర్శలు

ముస్లిం అయి ఉండి హిందూ భక్తి గీతం పాడిన ఓ గాయని ఆన్ లైన్ లో వేధింపులకు గురైంది. ఆమె పాడిన పాటకు జడ్జిలతో సహ ప్రతి ఒక్కరూ లేచి చప్పట్లు కొట్టారు.

బెంగుళూరు:ముస్లిం అయి ఉండి హిందూ భక్తి గీతం పాడిన ఓ గాయని ఆన్ లైన్ లో వేధింపులకు గురైంది. ఆమె పాడిన పాటకు జడ్జిలతో సహ ప్రతి ఒక్కరూ లేచి చప్పట్లు కొట్టి తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.కాని, ఆమెను సోషల్ మీడియాలో కొందరు సనాతనవాదులు ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలో సుహానా సయిదా అనే గాయకురాలు ఉంటుంది.అయితే ఆమె తాజాగా అక్కడ జరిగిన ఓ రియాల్టీ షో లో హిందువుకు చెందిన భక్తిగీతం పాడి పలువురి ప్రశంసలు పొందింది. ఆమె రాగయుక్తంగా పాట పాడడంతో పలువురు ఆమెను ప్రశంసించారు.

ప్రేక్షకుల నుండి రియాల్టీ షో జడ్జిలు కూడ లేచి నిలబడి చప్పట్లు కొట్టి తమ హధ్షాన్ని వ్యక్తం చేశారు.అయితే కొందరు సనాతనవాదులు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ముస్లిం మతానికి చెందిన మహిళ అయి ఉండి హిందూ భక్తి గీతం ఎలా పాడతావంటూ ఆమెపై దుమ్మెత్తిపోశారు.

Muslim girl trolled for singing Hindu devotional song in singing reality show

మంగుళూరు ముస్లింస్ అనే పేస్ బుక్ పేజీలో కొందరు ఆమెపై విరుచుకుపడ్డారు. సుహాన్ , నువ్వు మగవాళ్ళ ముందు నిలబడి పాడడం ద్వారా ముస్లిం వర్గ పేరు ప్రతిష్టలను మంటగలిపావు . నువ్వేదో పెద్ద విజయం సాధించానని భావించకూడదని చెప్పారు. ఆరు నెలల్లో ఖురాన్ ఖురాన్ ను మొత్తాన్ని కంఠతా పట్టిన ఇంకా ఎక్కువ సాధించనవాళ్ళు కూడ ఉన్నారని చెప్పారు. నీ అందాన్ని ఇతర పురుషులకు ఎలా చూపించావు. నీ తల్లిదండ్రులు నిన్నెలా ప్రోత్సహించారంటూ ఆమెను ప్రశ్నించారు.

నీ కారణంగా నీ తల్లిదండ్రులు స్వర్గానికి వెళ్ళరు. నువ్వు వేసుకొంటున్న పరదాను గౌరవించకపోతే దాన్ని తీసి పారెయ్యి అంటూ రాశారు.అయితే సుహానా హిందూ భక్తి గీతం పాడిన తర్వాత జడ్జీలు కూడ ఆమెను అభినందించారు. ఆమె హిందూ ముస్లింల సమైక్యతకు వారధిలా నిలుస్తోందని ప్రశంసించారు.

కన్నడ సంగీత దర్శకుడు అర్జున్ జన్య కూడ సుహానాపై ప్రశంసలు కురిపించాడు.నీ గొంతు చాలా బాగుంది అదర్భుతంగా పాడావు.. హిందూ భక్తీ గీతం పాడడం ద్వారా నువ్వు సమైక్యతకు నిదర్శనంగా నిలిచావు. ప్రజలందరినీ ఏకం చేయడానికి సంగీతం మంచి సాధనమని ఆయన చెప్పారు.అయితే స్వంత వర్గం నుండి వస్తోన్న బెదిరింపులతో సుహానా అజ్ఘాతంలోకి వెళ్ళిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+