వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిజాబ్ పై తీర్పుతో కర్ణాటక బంద్ కు ముస్లిం సంఘాల పిలుపు; పోలీసుల అలెర్ట్

|
Google Oneindia TeluguNews

కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వ్యవహారం ఇంకా దుమారం రేపుతూనే ఉంది. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర బంద్ కు కర్ణాటక ముస్లిం సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తీర్పుపై ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక హైకోర్టు తీర్పుతో కర్ణాటకలోని ముస్లిం సంస్థలు బుధవారం మార్చి 17న గురువారం రాష్ట్ర బంద్‌ను ప్రకటించాయి.

వారిది ఢిల్లీలో భరతనాట్యం, ఏపీలో శివతాండవం; పవన్ త్రిశంకుస్వర్గంలో: సీపీఐ నారాయణవారిది ఢిల్లీలో భరతనాట్యం, ఏపీలో శివతాండవం; పవన్ త్రిశంకుస్వర్గంలో: సీపీఐ నారాయణ

 కర్ణాటక బంద్ కు ప్రజలు స్వచ్చందంగా సహకరించాలి

కర్ణాటక బంద్ కు ప్రజలు స్వచ్చందంగా సహకరించాలి

కర్ణాటక రాష్ట్ర బంద్ కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని ముస్లిం సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తులు కాకుండా యూనిఫామ్ ధరించాలని, ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరి ఏమీ కాదని కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి మరియు న్యాయమూర్తులు కృష్ణ ఎస్ దీక్షిత్ మరియు జెఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం, ఇస్లాం యొక్క ముఖ్యమైన మతపరమైన ఆచారాలలో హిజాబ్ భాగం కాదు, అందువల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం హిజాబ్ అవసరం లేదని పేర్కొంది.

 సుప్రీంలో హిజాబ్ పై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ముస్లిం సంఘాలు

సుప్రీంలో హిజాబ్ పై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ముస్లిం సంఘాలు


హిజాబ్ వ్యవహారంపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను కర్ణాటక హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో పై సవాల్ చేస్తూ ముస్లిం పెద్దలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొందరు తీర్పు వచ్చిన వెంటనే మళ్లీ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే తమకు సమయం కావాలని, హోలీ తర్వాత విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.

 కర్ణాటక బంద్ కు ముస్లిం సంఘాల పిలుపుతో ఉద్రిక్తత

కర్ణాటక బంద్ కు ముస్లిం సంఘాల పిలుపుతో ఉద్రిక్తత


ఇక ఈ సమయంలో కర్ణాటక రాష్ట్ర బంద్ కు ముస్లిం సంఘాలు పిలుపునివ్వడం ఉద్రిక్తతలకు కారణంగా మారింది. కర్ణాటక అమీర్-ఎ-షరియత్, మౌలానా సగీర్ అహ్మద్ రషాది మాట్లాడుతూ, భారత రాజ్యాంగం యొక్క ఆత్మకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుకు నిరసనగా బంద్‌లో ముస్లింలు మరియు భావసారూప్యత గల వారందరూ పాల్గొనవలసిందిగా మేము కోరుతున్నామని పేర్కొన్నారు.

బంద్ నేపధ్యంలో అలెర్ట్ అయిన పోలీసులు

బంద్ నేపధ్యంలో అలెర్ట్ అయిన పోలీసులు


ప్రజలు, ప్రత్యేకించి యువత ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని, దుకాణాలను మూసివేయమని ఎవరినీ బలవంతం చేయవద్దని మేము అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నారు. నిరసనలో ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని అమీర్-ఎ-షరియత్ విజ్ఞప్తి చేసింది. రేపు కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం సంఘాల బంద్ కు పిలుపు నేపధ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు.

English summary
Muslim groups call for Karnataka bandh tomorrow over high court verdict on hijab. Police alert with the muslim leaders call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X