'ముగ్గరు నలుగురు భార్యలు ఉంటే.. మహిళలకే రక్షణ!!'

న్యూఢిల్లీ : ఒకే వ్యక్తికి ముగ్గురు నలుగురు భార్యలు ఉంటే.. సమాజంలో అక్రమ సంబంధాలు తగ్గుముఖం పడుతాయని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదిస్తోంది. బహు భార్యత్వం వల్ల మహిళలకు రక్షణ కూడా ఏర్పడుతుందని చెబుతోంది ముస్లిం పర్సనల్ లా బోర్డు.

తలాక్ పద్దతిలో విడాకులు తీసుకునే విషయమై కోర్టులో వాదనలు జరుగుతుండడంతో.. 68 పేజీల అఫిడవిట్ దాఖలు చేసిన కోర్టు, ఈ అంశాలను అందులోను ప్రస్తావించినట్లు సమాచారం. ముస్లి పర్సనల్ లా బోర్డు వాదనల ప్రకారం.. కలిసి జీవించడం కష్టమని భావించినప్పుడు.. సులువుగా విడిపోయేందుకే ముస్లిం సమాజంలో తలాక్ పద్దతి ఉందని, విడిపోవాలనుకున్న తర్వాత ఇద్దరూ కలిసి జీవించే పరిస్థితి ఇక ఉండదు కాబట్టే తలక్ ద్వారా విడాకులు ఇప్పిస్తున్నామని అభిప్రాయపడింది లా బోర్డు.

Muslim Law Board: Courts can't interfere in personal law

విడిపోవాలనుకున్న జంట తిరిగి కలిసి ఉంటే.. భర్త నుంచి వేధింపులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి.. ఆ చిత్రహింసల నుంచి మహిళలను రక్షించడానికి తలాక్ ఉపయోగపడుతుందని ముస్లిం లా బోర్డు పేర్కొంది. విడాకుల కోసం కోర్టులకెక్కితే.. సమయంతో పాటు డబ్బు కూడా ఎక్కువ ఖర్చవుతుందని, ఇన్ని ఆటంకాల కంటే తలాక్ చెప్పడమే సరైన విధానమని చెప్పుకొచ్చింది. ఇక పాశ్చాత్య దేశాల్లో విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. అక్కడ కోర్టుల ద్వారానే విడాకులు మంజూరు చేస్తారని అయితే అదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని లాబోర్డు తన వాదనలు వినిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+