వాడు ముస్లీం అయినా నేహాకు మా మద్దతు, వ్యాపారులు ఏం చేశారంటే ?, కాలేజ్ లో గదికి !

హుబ్బళి కాలేజ్ అమ్మాయి నేహా హిరేమఠ్ హత్యను ఖండిస్తూ హుబ్బళ్లిలోని అంజుమన్ సంస్థ ఈరోజు సోమవారం ధారవాడలో బంద్‌కు పిలుపునిచ్చింది. నేహా హత్యను ఖండిస్తూ వాణిజ్య నగరమైన హుబ్బళి-ధారవాడ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో హుబ్బళి-ధారవాడ జంట నగరాల్లో ముస్లింలు వారి వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేసి బంద్ కు మద్దతు ఇచ్చారు.

బంద్‌కు హుబ్బళిలోని షా బజార్, నూరానీ మార్కెట్ వ్యాపారులు మద్దతు తెలిపారు. కాలేజ్ అమ్మాయి నేహా హత్యను ఖండించిన వ్యాపారులు దుకాణాలు బంద్ చేసి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దుకాణాలు బంద్ చేశారు. కాలేజ్ అమ్మాయి నేహా హిరేమఠ్ కు న్యాయం చేయాలంటూ ముస్లీం వ్యాపారులు దుకాణాల ముందు బోర్డులు పెట్టి బంద్‌కు మద్దతు తెలిపారు. ఇప్పటికైనా హంతకుడు ఫయాజ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు.

Muslim traders staged a bandh to protest the murder of college girl Neha

వ్యాపారలావాదేవీలకు పెట్టింది పేరు అయిన హుబ్బళి-ధారవాడలోని మార్కెట్ ఏరియాలు బోసిపోయాయి. కాలేజ్ విద్యార్థిని నేహా హిరేమఠ్ హత్యపై అంజుమన్ సంస్థ అధ్యక్షుడు ఇస్మాయిల్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ నేహా హిరేమఠ్ హత్యకు గురికావడం దురదృష్టకరమన్నారు. హుబ్బళి లాంటి మహానగరంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని, నేహా హత్య ను తాము అందరూ ఖండిస్తున్నామని అన్నారు.

నేహా ను హత్య చేసిన. ఫయాజ్ చాలా నీచమైన పని చేశాడని, నేహా కార్పోరేటర్ నిరంజన్ కూతురు మాత్రమే కాదని, మాకు కూడా కూతురే అని, నేహా హత్యకేసు నిందితుడు ఫయాజ్‌ను కఠినంగా శిక్షించాలి అని ఇప్పటికే హుబ్బళి-ధారవాడ జంట నగరాల పోలీసు కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చామని అన్నారు. ఇది ప్రత్యేక కేసు అని తెలుసుకుని 90 రోజుల్లోగా కేసును పరిష్కరించాలని, సమాజంతో సంబంధం లేకుండా తగిన శిక్ష విధించాలని ముస్లీం సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Muslim traders staged a bandh to protest the murder of college girl Neha

అంజుమన్ ప్రాంగణం నుంచి ముస్లీం వ్యాపారులు ర్యాలీగా మౌనదీక్ష చేశారు. త్వరలో మా కాలేజీలోని ఒక గదికి నేహా పేరు పెడతామని, నేహాను హత్య చేసిన హంతకుడు ఫయాజ్ తరపున ఏ ముస్లిం లాయర్ కూడా వాదించకూడదని తాము డిమాండ్ చేస్తున్నామని, ఇప్పటికే మేము ముస్లీం లాయర్లకు ఇదే విషయాన్ని చెప్పామని, ఫయాజ్ తరపున వాదించకూడదని ముస్లీం లాయర్లు అంగీకరించారని, కేసు ముగిసే వరకు మా ముస్లీం సమాజం నేహా కుటుంబం వెంటే ఉంటుందని ముస్లీం మత పెద్దలు అన్నారు.

కార్పోరేటర్ నిరంజన్ చాలా ఏళ్లుగా మాకు బాగా తెలుసు అని, ఆయన చాలా మంచి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి కుమార్తె నేహాను దారుణంగా హత్య చెయ్యడం చాలా బాదగా ఉందని ముస్లీం వ్యాపారులు అన్నారు. నేహాను హత్య చేసిన హంతకుడు ఫయాజ్‌కి ఆ దేవుడే కఠిన శిక్ష వేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని, పోలీసులు నిజాయితీగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని ముస్లీం వ్యాపారులు మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+