Mutton: మంగళవారం మటన్ చెయ్యలేదని అర్దరాత్రి భార్యను ?, దెబ్బకు పక్కింటోడి ప్రాణం పోయింది!

భోపాల్/మధ్యప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. చిన్న వ్యాపారం చేస్తున్న భర్త ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కువగా బయటే ఉంటున్నాడు. రాత్రి మటన్ తీసుకెళ్లిన భర్త అతని భార్యకు ఇచ్చి కూర చెయ్యాలని చెప్పాడు. అరోజు మంగళవారం, ఇంట్లో మాంసాహారం చెయ్యకూడదని భార్య చెప్పింది. దంపతుల మద్య గొడవ పెద్దది అయ్యింది. ఆ సందర్బంలో పక్కింటివాళ్లు జోక్యం చేసుకుని భర్తకు బుద్దిమాటలు చెప్పాలని ప్రయత్నించారు. దంపతుల మద్య జరుగుతున్న గొడవను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి హత్యకు గురికావడం కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో పప్పు అరివార్ అలియాస్ పప్పు (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పప్పు కుంతిబాయ్ అలియాస్ కుంతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న పప్పు, కుంతిబాయ్ దంపతులు ఇంతకాలం సంతోషంగా కాపురం చేస్తున్నారు.

రాత్రి 11 గంటలకు మటన్ తీసుకెళ్లిన భర్త

రాత్రి 11 గంటలకు మటన్ తీసుకెళ్లిన భర్త

చిన్న వ్యాపారం చేస్తున్న పప్పు ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కువగా బయటే ఉంటున్నాడు. ఉదయం పప్పు ఇంటి నుంచి చాలా సంతోషంగా బయటకు వెళ్లాడు. మంగళవారం కావడంతో పప్పు భార్య కుంతి సాయంత్రం ఇంట్లో పూజ చేసింది. రాత్రి 11 గంటల సమయంలో మటన్ తీసుకెళ్లిన పప్పు అతని భార్యకు ఇచ్చి ఇప్పుడే కూర చెయ్యాలని చెప్పాడు.

మంగళవారం మంచిదికాదని

మంగళవారం మంచిదికాదని

అరోజు మంగళవారం, ఇంట్లో మాంసాహారం చెయ్యకూడదని, సాయంత్రం నేను పూజ కూడా చేశానని, రేపు ఉదయం కూర చేస్తానని కుంతి ఆమె భర్త పప్పుకు చెప్పింది. అర్దరాత్రి కుంతి, పప్పు దంపతుల మద్య మటన్ కూర చేసే విషయంలో గొడవ పెద్దది అయ్యింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన పప్పు రెచ్చిపోయాడు.

అర్దరాత్రి భార్యను బయటకు తోసేశాడు

అర్దరాత్రి భార్యను బయటకు తోసేశాడు

అర్దరాత్రి అనికూడా చూడకుండా పప్పు అతని భార్య కుంతిని చితకబాదేసి ఇంటి నుంచి బయటకు తోసేసి లోపల లాక్ చేసుకున్నాడు. పప్పు పక్కింటిలో నివాసం ఉంటున్న బల్లునాథ్ (45) అనే వ్యక్తితో పాటు చుట్టుపక్కల వాళ్లు పప్పు ఇంటి దగ్గరకు చేరుకుని కుంతిని ఓదార్చారు. ఆ సందర్బంలో పప్పుకు చుట్టుపక్కల వాళ్లు బుద్దిమాటలు చెప్పడానికి ప్రయత్నించారు.

జోక్యం చేసుకుంటే ప్రాణం పోయింది

జోక్యం చేసుకుంటే ప్రాణం పోయింది

ఆ సందర్బంలో పక్కింటివాళ్లు జోక్యం చేసుకుని భర్తకు బుద్దిమాటలు చెప్పాలని ప్రయత్నించారు. కుంతి, పప్పు దంపతులకు బుద్దిమాటలు చెప్పడానికి బల్లునాథ్ ప్రయత్నించాడు. ఆ సమయంలో రెచ్చిపోయిన పప్పు కత్తి తీసుకుని బల్లునాథ్ ను దారుణంగా పొడిచేశాడు. తీవ్రగాయాలైన బల్లునాథ్ అక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న బిల్విరియా పోలీసులు పప్పును అరెస్టు చేశారు. బల్లునాథ్ భార్య ఇటీవల చనిపోయిందని, అతని కొడుకు సచిన్ (19)తో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడని పోలీసులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+